పవన్ కళ్యాణ్ రాజమౌళి కాంబినేషన్ లో ఒక్క సినిమా తెరకెక్కితే బాగుంటుందని పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకుంటున్నారు. చాలా సంవత్సరాల క్రితం రాజమౌళి విక్రమార్కుడు కథను పవన్ కు చెప్పారు. అయితే వేర్వేరు కారణాల వల్ల ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ నటించలేదు. విక్రమార్కుడు కథను రాజమౌళి రవితేజతో తెరకెక్కించి విజయాన్ని సొంతం చేసుకున్నారు. బాహుబలి2 రిలీజ్ సమయంలో రాజమౌళి మల్టీస్టారర్ సినిమా చేద్దామని హింట్ ఇచ్చారని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.
ఆ సమయంలో రజనీకాంత్ కమల్ హాసన్, చిరంజీవి పవన్, చిరంజీవి రామ్ చరణ్, చిరంజీవి అల్లు అర్జున్ కాంబినేషన్లను పరిశీలించామని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఆ తర్వాత పవన్ రాజమౌళి కాంబోకు సంబంధించి విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమాలో భీమ్ రామ్ కు సీతారామరాజు గెటప్ ఇచ్చాడని రామ్ హక్కుల కోసం పోరాడే ధైర్యాన్ని భీమ్ కు ఇచ్చాడని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. అలా సినిమాలో ఒకరికొకరు గురువులు అయ్యారని ఆయన అన్నారు.
భీమ్ పాత్ర విషయంలో తారక్ సంతృప్తితో ఉన్నారని బయట జరిగే ప్రచారంలో నిజం లేదని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. నైజాం బ్యాక్ డ్రాప్ లో ముద్ర మూవీ రాశానని ఆయన వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ సినిమా చూసే సమయంలో నాకు నిద్ర వచ్చిందని ఆయన అన్నారు. పవన్ తో రాజమౌళి సినిమాకు సమయం సందర్భం రావాలని విజయేంద్ర ప్రసాద్ కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ డేట్స్ తో ప్రొడ్యూసర్ ఎవరూ కలవలేదని ఇద్దరు స్టార్లతో సినిమా చేయాలనుకుంటే పవన్ తో ఇంకో స్టార్ చేయడం సాధ్యం కాదని ఆయన వెల్లడించారు.
పవన్ సూపర్ డూపర్ మెగాస్టార్ అని ఆయన రేంజ్ స్టార్ ఎవరూ లేరు కదా అని విజయేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. పవన్ తో జక్కన్న సినిమా తీయకపోవడానికి కారణాలివేనని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. మహేష్ తో పదేళ్ల క్రితం అనుకుంటే ఇప్పుడు సినిమా సాధ్యమవుతోందని ఆయన పేర్కొన్నారు.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?