‘ఊపిరి’ దర్శక నిర్మాతలు మోసం చేశారట!

నాగార్జున, కార్తీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఊపిరి’ చిత్రాన్ని పివిపి బ్యానర్ పై నిర్మించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలో ఊపిరి దర్శక నిర్మాతలు ఓ నటుడ్ని మోసం చేసారంటూ.. ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు సీనియర్ నటుల్లో ఒకరైన రాజారవీంద్ర ఇదివరకే ‘ఊపిరి’ అనే టైటిల్ ను రిజిటర్ చేయించారు. ఆ టైటిల్ తమకు ఇస్తే సినిమాలో మంచి పాత్ర ఇస్తామని దర్శక నిర్మాతలు రాజారవీంద్రకు ఆశ పెట్టారట. నాగార్జున లాంటి స్టార్ హీరో సినిమా కాబట్టి డబ్బులు కూడా డిమాండ్ చేయకుండా టైటిల్ ను ఇచ్చేసాడట. వారు చెప్పినట్లుగా చిన్న పాత్ర ఇచ్చినా.. ఆ రోల్ కు ఎలాంటి ప్రాముఖ్యత లేదని.. ఒకరకంగా తాను మోస పోయానని రాజా రవీంద్ర బాధ పడుతున్నట్లు సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus