Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?
- August 13, 2026 / 11:49 PM ISTByPhani Kumar
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కి తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళంలో మాత్రమే కాదు తెలుగులో కూడా అతని సినిమాలకి గ్రాండ్ రిలీజ్ ఉంటుంది. ముఖ్యంగా యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో సినిమాలు చేశాడు అంటే విశాల్ కి తిరుగుండదు. అల్మోస్ట్ 12 ఏళ్ళ తర్వాత రిలీజ్ అయిన ‘మదగజరాజ’ సైతం ఈ విషయాన్ని ప్రూవ్ చేసింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ రూ.50 కోట్లకు పైగా వసూళ్ళు సాధించిన సంగతి తెలిసిందే.
Makutam
ఇక ఇప్పుడు విశాల్ నుండీ ‘మకుటం'(Makutam) అనే యాక్షన్ మూవీ రాబోతోంది. స్వయంగా విశాల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషంగా చెప్పుకోవాలి. ‘సూపర్ గుడ్ ఫిల్మ్స్’ సంస్థ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.

అంజలి,దుషారా విజయన్..లు ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. టీజర్, ట్రైలర్.. వంటివి పెద్దగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. ఎందుకంటే విశాల్ మొన్నమధ్య చేసిన ‘మార్క్ ఆంటోనీ’ సినిమాకి చాలా దగ్గరగా ‘మకుటం’ కనిపిస్తుంది కాబట్టి..! అయితే ట్రైలర్లో కామిడీ,యాక్షన్ అంశాలు ఎక్కువగా ఉండటం వల్ల దీనిని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆల్రెడీ ఈ చిత్రాన్ని కొంతమంది టాలీవుడ్ పెద్దలు వీక్షించడం జరిగింది.
సినిమా చూసిన అనంతరం వారు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. వారి టాక్ ప్రకారం సినిమా 3 గంటల 5 నిమిషాల నిడివి కలిగి ఉంటుందట. సినిమాలో కామిడీతో పాటు యాక్షన్ అంశాలు కూడా సమానంగా ఉంటాయని అంటున్నారు. 3 రకాల పాత్రల్లో విశాల్ నటన, కామిడీ క్లైమాక్స్ బాగున్నాయి అంటున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ సేవియర్ అంటున్నారు. మరి రిలీజ్ రోజున ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.













