Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?
- August 13, 2026 / 11:22 PM ISTByPhani Kumar
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. ఆల్మోస్ట్ దశాబ్ద కాలం తర్వాత కరుప్పు( తెలుగులో వీరభద్రుడు) తో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకుని స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు.ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. తెలుగులో సైతం ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ‘కరుప్పు’ వేడి ఇంకా తగ్గకముందే.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్'(Vishwanath And Sons) అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు సూర్య. తెలుగులో సూర్య చేసిన స్ట్రైట్ మూవీ ఇది.
Vishwanath And Sons
వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ పై సూర్య దేవర నాగవంశీ నిర్మించాడు. టీజర్, ట్రైలర్, పాటలు వంటివి పర్వాలేదు అనిపించాయి.

త్రివిక్రమ్ ఈ సినిమా చూసి సూపర్ హిట్ అని చెప్పినట్టు నిర్మాత నాగవంశీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పడంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. త్రివిక్రమ్ తో పాటు ఇండస్ట్రీలో ఉన్న మరికొందరు పెద్దలు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ని వీక్షించినట్టు తెలుస్తోంది. వారి టాక్ ప్రకారం.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం 2 గంటల 41 నిమిషాల నిడివి కలిగి ఉంటుందట. ఫస్ట్ హాఫ్ లో సూర్య ఎంట్రీ, మొదటి 15 నిమిషాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట.
మామితా బైజు పాత్ర ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత ఎంటర్టైనింగ్ గా మారుతుందని అంటున్నారు. ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ ను దర్శకుడు వెంకీ చాలా బాగా డిజైన్ చేశారట. సెకండాఫ్ లో రాధిక, సూర్య, మామితా బైజు..ల మధ్య వచ్చే సన్నివేశాలు, వెంకీ మార్క్ డైలాగ్స్ అన్నీ ఆకట్టుకుంటాయట.టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.మొత్తంగా సూర్యకి పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్..ల ‘అత్తారింటికి దారేది’ రేంజ్ హిట్ పడిందని అంటున్నారు.మరి రిలీజ్ రోజున ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.
















