‘బాహుబలి’ (Baahubali) సినిమాల తర్వాత ప్రభాస్‌కు (Prabhas) సరైన విజయం లేదు అంటూ గత కొన్ని ఏళ్లుగా అభిమానులు బాధపడుతూనే ఉన్నారు. ఆ బాధను వరుస సినిమాల విజయాలు తీర్చేశాయి అనుకోండి. అయితే ప్రభాస్ పెడుతున్న స్వీట్ టార్చర్ మాత్రం ఇంకా కొనసాగుతోందట. ఈ విషయాన్ని ప్రభాస్ కొత్త సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న అమ్మాయే చెప్పింది. ఒక ఊరుకు సరిపోయే ఫుడ్ తెస్తున్నాడు అని చెప్పుకొచ్చింది. ప్రభాస్ ప్రస్తుతం మారుతి (Maruthi Dasari) దర్శకత్వంలో ‘రాజాసాబ్’ (The Rajasaab)అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాలో ఒక హీరోయిన్ మాళవిక మోహనన్ (Malavika Mohanan) నటిస్తోంది.
రొమాంటిక్ హారర్ కామెడీ జోనర్‌లో రూపొందుతున్న ఈ సినిమా సెట్స్‌లో జరిగిన / జరుగుతున్న విషయాన్ని చెప్పుకొచ్చింది. తన తాజా చిత్రం ‘యుధ్రా’ ప్రచారంలో పాల్గొన్న ఆమె ‘రాజాసాబ్’ షూటింగ్ గురించి, ప్రభాస్ గురించి మాట్లాడింది. ‘రాజాసాబ్’ చిత్రంతో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టబోతున్నందుకు ఆనందంగా ఉంది. ప్రస్తుతం సగం షూటింగ్ అయిపోయింది అంటూ అప్‌డేట్ ఇచ్చిన మాళవిక మోహనన్.. ప్రభాస్ ఫుడ్ ఫెస్టివల్ గురించి కూడా చెప్పింది. ప్రభాస్ ఇంటి భోజనానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే అని చెప్పిన ఆమె..
భోజనమంటే ఏదో ఒక కర్రీ, బిర్యానీ తెప్పించడం కాదు ఏకంగా పెద్దపెద్ద పాత్రల్లో ఒక గ్రామానికి సరిపోయేంత ఆహారాన్ని ఏర్పాటు చేస్తాడు అని చెప్పింది. అంతేకాదు తాను ఇప్పటివరకు అలాంటి రుచికరమైన ఆహారాన్ని తినలేదు అని కూడా చెప్పింది. దీంతో ప్రభాస్ స్వీట్ టార్చర్‌కు ఆమె బలైపోయింది అంటూ అభిమానులు సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఇక ‘రాజాసాబ్’ విషయానికొస్తే..
యూవీ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ఇప్పటివరకు చేయని సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. 2025 ఏప్రిల్ 10న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్‌తోపాటు నిధి అగర్వాల్, రిద్ది కూడా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. మరి మారుతి ఏం మ్యాజిక్ చేస్తారో చూడాలి.