Malavika Mohanan: మాళవిక మనసులో మాట విన్నారా?ఎవరిస్తారో ఆ అవకాశం!

తెలుగులో సినిమాలు చేయలేదు… మనకు వచ్చిన డబ్బింగ్‌ సినిమాలో కూడా కాస్త పద్ధతిగా కనిపించంది కానీ.. సోషల్‌ మీడియాలో మాత్రం అందాల ఆరబోత విషయంలో ఏ మాత్రం హద్దులు పెట్టుకోని సుందరి మాళవిక మోహనన్‌. ఈ కేరళ కుట్టి అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. డస్కీ లుక్‌లో ఈ భామ సోషల్‌ మీడియాలో పెట్టే ఫొటోలకు భలే స్పందన వస్తూ ఉంటుంది. లైక్‌లు, కామెంట్లు అబ్బో. అలాంటి అందం ఇప్పుడు గన్ను పడతా అంటోంది.

అవును, మీరు చదివింది కరెక్టే. ఆమె మనసులో మాటే అది. ఆమె చెప్పింది కూడా. హీరోయిన్లకు హీరోల మల్లే డ్రీమ్ రోల్స్ ఉంటాయి. అలా హాట్ హీరోయిన్ మాళవిక మోహనన్‌కు (Malavika Mohanan) ఓ డ్రీమ్ రోల్ ఉంది. అదే లేడీ గ్యాంగ్ స్టర్ పాత్ర. గ్యాంగ్‌స్టర్‌ రోల్ పోషించాలని ఉంది. ఓ హీరోయిన్ గ్యాంగ్ స్టర్‌గా కనిపిస్తే చూడటానికి బాగుంటుంది అని మాళవిక చెప్పుకొచ్చింది. అంతే కాకుండా తాను ఈ మధ్య యాక్షన్ సీక్వెన్స్ కోసం ట్రైనింగ్ కూడా తీసుకున్నానని, అందుకే లేడీ గ్యాంగ్ స్టర్‌గా కనిపిస్తే బాగుంటుంది అనిపిస్తోందని మాళవిక చెప్పుకొచ్చింది.

విక్రమ్ (Vikram) సినిమా ‘తంగలాన్’లో (Thangalaan) మాళవిక పాత్రకు కాస్త యాక్షన్‌ టచ్‌ కూడా ఉంది. ఈ క్రమంలో ఆ సీన్స్‌ చేస్తున్నప్పుడు లేడీ గ్యాంగ్‌స్టర్‌ పాత్ర మీద మోజు పెరిగింది అని చెప్పొచ్చు. ఇంతేకాదు.. మరికొన్ని అంశాల మీద కూడా మాళవిక మాట్లాడింది. ఆమెకు సోషల్‌ మీడియాలో తరచుగా ఎదురయ్యే పెళ్లి, హాట్‌ ఫొటో షూట్ల గురించి స్పందించింది.

‘నా పెళ్లిపై మీకెందుకు అంత తొందర’ అని క్లియర్‌ కౌంటర్‌ వేయగా… హాట్ ఫొటోషూట్స్ ఎందుకు అని అడిగితే.. ‘అలా కనిపించడం నాకు ఇష్టం’ అని సమాధానం ఇచ్చింది. ఇక మాళవిక సినిమాలు చూస్తే తెలుగులో ప్రభాస్‌ (Prabhas) హీరోగా ‘రాజా సాబ్‌’లో (The Rajasaab) నటిస్తోంది. ఇక విక్రమ్‌ ‘తంగలాన్‌’ ఎలాగా ఉంది. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus