అందాలతో మతిపోగొడుతున్న మాళవిక శర్మ

వాణిజ్య ప్రకటనలతో బాగా పాపులర్ అయిన మాళవిక శర్మ.. రవితేజ సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమయింది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన “నేల టిక్కెట్టు” లో మెడికల్ విద్యార్థిగా నటించింది. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఫెయిల్ కావడంతో మాళవిక శర్మ చాలా డిజప్పాయింట్ అయింది. ఈ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో మరిన్ని అవకాశాలు అందుకోవాలని కలలు కనింది. సినిమా కోసం బాగా కష్టపడింది. తన పాత్రకు న్యాయం చేసినప్పటికీ సినిమా విజయం సాదించకపోయేసరికి శ్రమ అంత వృధా అయింది. ఈ ఫలితం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది.

మొదటిది నిరాశపరిచిన రెండో సినిమాతోనైనా హిట్ కొట్టాలని ఆశ పడుతోంది. అందుకే హాట్ ఫోజులతో ఆఫర్లకు ఎర వేస్తోంది. రీసెంట్ గా బీచ్ లో తీసుకున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ లుక్ యువతుల మతి పోగొడుతోంది. ఈ ఫోటోని నెటిజనులు విపరీతంగా షేర్ చేస్తున్నారు. తెలుగు దర్శకనిర్మాతల దృష్టిలో కూడా ఈ భామ పడింది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు హీరో రామ్ తో ఓ సినిమా చేయబోతున్నారు. అందులో హీరోయిన్ గా మాళవిక శర్మ ని తీసుకోవాలని పరిశీలిస్తున్నారు. ఈ ఛాన్స్ అందుకుంటే మాళవిక రెచ్చిపోయి అందాలు ఆరబోయడం గ్యారంటీ.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus