ప్రముఖ మలయాళ నటుడు రిజబావా అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 55 ఏళ్లు. కొచ్చిలోని ప్రైవేట్ హాస్పిటల్ లో కిడ్నీకి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన సోమవారం చనిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో సినిమా ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నారు. ఆయన మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. నటులు పృథ్వీ రాజ్ సుకుమారన్, అక్షయ్ ప్రేమనాథ్ తమ సంతాపం వ్యక్తం చేశారు. 1990లలో మలయాళ సినిమా ఇండస్ట్రీలో విలన్ గా పలు సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించారు.
1990లో షాజీ కైలాస్ డైరెక్ట్ చేసిన డాక్టర్ పశుపతి అనే సినిమాలో రిజబావా తొలిసారిగా నటించారు. అదే ఏడాది వచ్చిన కామెడీ థ్రిల్లర్ ‘ఇన్ హరిహర్ నగర్’లో జాన్ హునై పాత్ర ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అక్కడ నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. దాదాపు 150 చిత్రాల్లో నటించిన ఆయన పలు సీరియల్స్ లో కూడా నటించారు. చివరిగా ఆయన మమ్ముట్టి నటించిన ‘వన్’ సినిమాలో నటించారు.
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!