మలయాళం వెర్సస్ తెలుగు ప్రేమమ్

  • September 21, 2016 / 02:50 PM IST

అందమైన ప్రేమకథా చిత్రం ‘ప్రేమమ్’. మలయాళంలో గత ఏడాది రిలీజ్ అయినా ఈ చిత్రం భాష బేధం లేకుండా యూత్ అందరిని ఆకట్టుకుంది. టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జునను ఆకర్షించింది. దీంతో ఆ కథలో తన కుమారుడిని చూసుకోవాలని అనుకున్నారు. యువ సామ్రాట్ నాగ చైతన్య ఆ కథలో ఇమిడి పోయి కొత్త ప్రేమమ్ తో పలకరించడానికి సిద్ధమయ్యాడు. “లవ్‌స్టోరీస్ ఎండ్…ఫీలింగ్స్ డోంట్” అనే ట్యాగ్ లైన్ తో రూపొందిన ఈ మూవీ దసరాకు రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మలయాళం, తెలుగు వెర్షన్ లోని ప్రత్యేకతలపై ఫోకస్…

కథఒక అబ్బాయి స్కూల్ దశలో పదవ తరగతి చదువుతుండగా తోటి విద్యార్థినిని ప్రేమిస్తాడు. చిరు ప్రాయంలో చిగురించిన ఆ ప్రేమ కొంతకాలమే ఉంటుంది. ఆ తర్వాత డిగ్రీ చదువుతుండగా అక్కడికి గెస్ట్ ఫ్యాకల్టీ గా వచ్చిన అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమెకి ప్రమాదం జరగడంతో గతం మరిచి పోతుంది. ఆ బాధ నుంచి కోలుకున్న ఆ అబ్బాయి జీవితంలో స్థిరపడుతున్న సమయంలో మరో అమ్మాయి అతని జీవితంలోకి వస్తుంది. ఇద్దరి ప్రేమించుకొని పెళ్లి పీఠలపై కూర్చుంటారు. ఆల్ఫోన్స్ పుథరిన్ రాసిన ఈ కథలో మార్పు లు చేయకుండా తెలుగు చిత్రాన్ని తెరకెక్కించారు.

హీరోముగ్గురు అమ్మాయిలతో ప్రేమలో పడే అబ్బాయిగా మలయాళం లో నివిన్ పౌలీ నటించారు. ఆ పాత్రని తెలుగులో అక్కినేని నాగచైతన్య పోషించారు. వీరిద్దరికి యూత్ లో బాగా ఫాలోయింగ్ ఉంది. ఏమాయ చేసావే చిత్రం తర్వాత పూర్తి లవ్ స్టోరీ తో ప్రేమమ్ ద్వారా చైతూ వస్తున్నారు.

హీరోయిన్లుమలయాళంలో అనుపమ పరమేశ్వరన్, సాయి పల్లవి, మడొనా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. తెలుగులో సాయి పల్లవి మిస్సయింది. ఆ స్థానంలో శృతి హాసన్ ప్రవేశించింది. తొలి సారి చైతూ, శృతి హాసన్ తెరపైన ప్రేమను పండించనున్నారు.

సంగీతంమలయాళం ప్రేమమ్ కి పాటలతో పాటు నేపథ్య సంగీతం ప్రాణం. కీలక సన్నివేశాల్లో తన సంగీతంతో రాజేష్ మురుగేషన్ కంటతడి పెట్టించారు. తెలుగు వెర్షన్ కి రాజేష్ మురుగేశన్ తో పాటు పి.సుందర్ జత కలిశారు. వీరిద్దరూ సంయుక్తంగా సంగీతం అందించారు. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా విడుదలైన పాటలు ఆకట్టుకుంటున్నాయి.

దర్శకత్వంమలయాళం ప్రేమమ్ ని ఆల్ఫోన్స్ పుథరిన్ డైరక్ట్ చేయగా, తెలుగు ప్రేమమ్ కి కార్తికేయ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నచందు మొండేటి దర్శకత్వం వహించారు. కథలో మార్పు లేకుండా తన మార్కు స్క్రీన్ ప్లే, మాటలతో అలరించనున్నారు. ఈ చిత్రం గురించి చందు మాట్లాడుతూ “విఫల ప్రేమ జ్ఞాపకాలు ఎన్నటికీ చెదిరిపోవు. మన హృదయాంతరాల్లో ఎప్పటికీ సజీవంగా వుంటాయి. జీవన గమనాన్ని మరింత స్ఫూర్తివంతం చేస్తాయి. అలాంటి అందమైన జ్ఞాపకాల సమాహారమే ప్రేమమ్” అన్నారు.

తెలుగు ప్రేమమ్ స్పెషల్సితార సినిమా పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ప్రేమంలో మరో ప్రత్యేకత ఏమిటంటే కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రల్లో కనిపించనుండడం. మామయ్య వెంకటేష్ తో కలిసి చైతూ నటించడం ఇదే తొలిసారి. మనం చిత్రం మాదిరిగా ఈ సినిమా సూపర్ హిట్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus