నరేష్ గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ గా ‘మళ్ళీ పెళ్లి’ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. పవిత్ర లోకేష్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ఎం.ఎస్.రాజు దర్శకుడు. ‘విజయ కృష్ణ మూవీస్ బ్యానర్’ పై నరేష్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.అనన్య నాగళ్ళ, అన్నపూర్ణ,వనిత విజయ్ కుమార్ వంటి వారు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. మే 26న ఈ మూవీ విడుదల అయ్యింది. టీజర్, ట్రైలర్ వంటివి జనాల్లో ఆసక్తిని రేకెత్తించాయి.
ఎందుకంటే ఇది నరేష్ – పవిత్ర ల జీవితంలోని సంఘటనలు ఆధారం చేసుకుని తీసిన కథ అని ప్రోమోలు స్పష్టం చేశాయి. మరీ ముఖ్యంగా నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి పై రివేంజ్ తో తీసిన సినిమాలా కూడా అనిపిస్తున్నట్లు అంతా భావించారు. అయితే మొదటి రోజు ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ అనుకున్న స్థాయిలో రాలేదు.ఇక మొదటి సోమవారం కూడా ఈ మూవీ హోల్డ్ చేసింది అంటూ ఏమీ లేదు. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 0.18 cr |
సీడెడ్ | 0.08 cr |
ఆంధ్ర | 0.11 cr |
ఏపీ+ తెలంగాణ టోటల్ | 0.37 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.07 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 0.44 cr |
‘మళ్ళీ పెళ్లి’ (Malli Pelli) చిత్రానికి రూ.1.49 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కొన్ని చోట్ల ఓన్ రిలీజ్ చేసుకున్నారు. సో బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ రూ.1.75 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా కేవలం రూ.0.44 కోట్ల షేర్ ను రాబట్టింది.
బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.1.31 కోట్ల షేర్ ను రాబట్టాలి. పోటీగా ‘2018’ ‘మేమ్ ఫేమస్’ వంటి సినిమాలు రిలీజ్ అవ్వడంతో ‘మళ్ళీ పెళ్లి’ చిత్రానికి చాలా మైనస్ అయ్యింది అని చెప్పాలి.
మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!
మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!