ఈ ఏడాది ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుని కొత్త లైఫ్ ని స్టార్ట్ చేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh), మీరా చోప్రా (Meera Chopra), దిల్ రాజు (Dil Raju) సోదరుడి కొడుకు ఆశిష్ వంటి వారు పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో బుల్లితెర నటుడు సైతం సైలెంట్ గా పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చాడు. ‘మామగారు’ సీరియల్ తో ఫేమస్ అయిన గంగాధర అలియాస్ ఆకర్ష బైరమూడి సైలెంట్ గా పెళ్లి చేసుకుంది అందరికీ షాక్ ఇచ్చారు.
అతని పెళ్లి వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. సెలబ్రిటీ యాంకర్, యూట్యూబర్ అయినటువంటి నిఖిల్ విజయేంద్ర సింహా ఇతని పెళ్ళికి సంబంధించి ఓ పోస్ట్ పెట్టారు. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఇతను ప్రేమించిన అమ్మాయికి మూడు ముళ్ళు వేసాడని స్పష్టమవుతుంది. గతంలో ఐశ్వర్య అనే అమ్మాయితో డేటింగ్లో ఉన్నట్టు ఆకర్ష తెలిపాడు. ఆమెనే పెళ్లి కూతురు అని ఈ వీడియో ద్వారా రివీల్ కాలేదు కానీ..’ఆమెనే పెళ్లి చేసుకుని ఉంటాడు….
మొత్తానికి ఇరు కుటుంబ పెద్దలను ఒప్పించి పెళ్లి పీటలెక్కాడు’ అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇతని పెళ్లి వార్త తెలుసుకున్న నెటిజన్లు, సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా తమ బెస్ట్ విషెస్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. ఇక కర్ణాటకలో పుట్టి పెరిగిన ఆకర్ష ‘పున్నాగ’, ‘అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు’, ‘అగ్ని పరీక్ష’, ‘రాజేశ్వరి విలాస్ కాఫీ’ వంటి సీరియల్స్ తో బాగా పాపులర్ అయ్యాడు.