ఓ సింగర్ గా కెరీర్ ను ప్రారంభించిన మమతా మోహన్ దాస్ .. ‘రాఖీ రాఖీ’ ‘ఆకలేస్తే అన్నం పెడతా’ ‘ఓలమ్మి తిక్కరేగిందా’ వంటి పాటలతో తక్కువ టైంలోనే చాలా క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఈమె హీరోయిన్ మెటీరియల్ అని భావించిన రాజమౌళి ‘యమదొంగ’ లో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత ఈమెకు వరుస ఆఫర్లు లభించాయి. ‘కృష్ణార్జున’ ‘విక్టరీ’ ‘హోమం’ ‘చింతకాయల రవి’ ‘కింగ్’ ‘కేడి’ వంటి పెద్ద సినిమాల్లో ఈమె నటించి మెప్పించింది.
కానీ ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. ఆ టైంలో ఈమె క్యాన్సర్ బారిన పడటం జరిగింది. కాబట్టి ట్రీట్మెంట్ కోసం ఈమె అమెరికాకి వెల్లడం కూడా జరిగింది. మొన్నామధ్య కొన్ని మలయాళం సినిమాల్లో కనిపించిన ఈమె తెలుగు సినిమాల్లో నటించడం లేదు. ఆఫర్లు లేకపోవడం వల్లే ఈమె తెలుగు సినిమాల్లో నటించడం లేదు అని అంతా అనుకున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తనకు తెలుగులో ఎందుకు ఆఫర్లు రావడం లేదో చెప్పుకొచ్చింది.
మమతా మోహన్ దాస్ మాట్లాడుతూ.. ” నా కెరీర్ ను ప్రారంభించిన కొన్నాళ్లకే నేను క్యాన్సర్ బారిన పడటం జరిగింది.ఆ టైంలో నా పేరెంట్స్ .. ఫ్రెండ్స్ నాకు చాలా ధైర్యం చెప్పారు అండగా నిలబడ్డారు. లైఫ్ లో ఒక టఫ్ పీరియడ్ ఎలా ఉంటుందనేది చూశాను. నా ట్రీట్మెంట్ కి సంబంధించిన పోస్టులు అయితే నేను సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. ఆ టైంలో కూడా నేను మలయాళంలో సినిమాలు చేశాను.
‘కేడీ’ తరువాత నేను తెలుగు సినిమాలకు చేయకపోవడానికి కారణం క్యాన్సర్ బారిన పడటం మాత్రమే కాదు. నాకు మంచి పాత్రలు దొరకలేదు. అందుకే నేను ఇక్కడి సినిమాల్లో నటించలేకపోయాను. కానీ నేను ఇంకా క్యాన్సర్ తోనే బాధపడుతున్నాననీ .. అందువలనే నేను సినిమాలు చేయడం లేదని ప్రచారం జరిగింది. నేను అందుబాటులో లేననే భావన దర్శకనిర్మాతలకు రావడం వల్లే నాకు అవకాశాలు రావడం లేదు అని నేను అనుకుంటున్నాను. అలాంటి తప్పుడు ప్రచారం నన్ను చాలా బాధ పెడుతుంది” అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది.