కొంత మందిని అదృష్టం ఎంత ఫస్ట్ గా వరిస్తుందో.. దురదృష్టం కూడా అంతే ఫాస్ట్ గా వెతుక్కుంటూ వస్తుందని చెప్పాలి. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ గా మమత మోహన్ దాస్ ను చెప్పుకోవచ్చు. సింగర్ గా కెరీర్ ను ప్రారంభించిన మమతా మోహన్ దాస్ .. ‘రాఖీ రాఖీ’ ‘ఆకలేస్తే అన్నం పెడతా’ ‘ఓలమ్మి తిక్కరేగిందా’ వంటి పాటలతో తక్కువ టైంలోనే బాగా పాపులర్ అయ్యింది.అదే టైంలో ఈమె హీరోయిన్ మెటీరియల్ అని గుర్తించిన రాజమౌళి ‘యమదొంగ’ లో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు.
ఆ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. ఆ తరవాత వెంటనే ‘కృష్ణార్జున’ ‘విక్టరీ’ ‘హోమం’ ‘చింతకాయల రవి’ ‘కింగ్’ ‘కేడి’ వంటి క్రేజీ ప్రాజెక్ట్ లలో అవకాశాలు దక్కించుకుంది. ఈమె నటించి మెప్పించింది. కింగ్ సినిమా విషయంలో దర్శకుడు శ్రీను వైట్ల ఈమెను మోసం చేశాడట.మొదట ఈమెకు చెప్పిన కథ ఒకటి తర్వాత తీసింది ఒకటి అంటూ ఈమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఈమె బాధను గమనించిన నాగార్జున కేడి సినిమాలో ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారట.
అయితే ఆ టైంలో మమత క్యాన్సర్ భారిన పడింది. కీమో థెరపీ కూడా తీసుకోవాల్సి వచ్చిందట. ఇదే విషయాన్ని ఆమె నాగార్జున కి తెలియజేసిందట. అప్పుడు నాగార్జున ప్రాబ్లం ఏమీ లేదు.. నువ్వు ట్రీట్మెంట్ తీసుకుంటూనే సినిమాలో నటించమని నాగార్జున చెప్పారట.’ సార్ నా జుట్టు కూడా ఊడిపోతుంది అని మమతా చెప్పినా ‘ నో ప్రాబ్లం ‘ అని నాగార్జున తెలియజేశారట.
అవసరమైతే నాగార్జున గారు వేరే హీరోయిన్ ను పెట్టుకోవచ్చు కానీ ఆయన ఇచ్చిన మాటకు కమిట్ అయ్యి మాట నిలబెట్టుకున్నారు. ఆ టైంలో నాగార్జున గారు నాకు దేవుడిలా అనిపించారు ‘ అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది మమత మోహన్ దాస్.