‘మహర్షి’ చిత్రం నుండీ ఆఖరి పాట కూడా విడుదలయ్యింది. ఈ పాటతో ఆడియో మొత్తం విడుదలయినట్టే. ‘పాల పిట్ట’ అంటూ సాగే ఈ పాట సినిమాలో మహేష్, పూజా హెగ్దే ల మధ్యలో వచ్చే డ్యూయెట్ లా అనిపిస్తుంది. ఇక ఈ పాట వింటుంటే… ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రంలోని ‘అదిరె అదిరె’ అనే పాత గుర్తుకు వస్తుంది అనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకూ విడుదల చేసిన పాటల్లో ఒక్క ‘పదర పదర’ పాట ఒక్కటే కాస్త ఆకట్టుకుందని చెప్పాలి. అయితే అది కూడా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రంలో ‘ఆకాశం’ పాటనే గుర్తుకు తెచ్చినప్పటికీ లిరిక్స్ మాత్రం బాగుండడంతో ఆకట్టుకుంది.
అయితే రాక్ స్టార్ గా పేరున్న దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరీ ఇంత ఘోరంగా విఫలమవ్వడం ఏంటనేది అర్థం కాని విషయం. కమర్షియల్ చిత్రాలకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్.. పెట్టింది పేరుగా చెప్పుకునేవారు. అయితే ఈ రాను రాను.. ఈ హడావిడి తగ్గుతుందా అనే అనుమానం కలుగుతుంది. కానీ ‘చిత్రలహరి’ చిత్రానికి దేవి మంచి మ్యూజిక్ నే ఇచ్చాడు. మరి ‘మహర్షి’ మ్యూజిక్ విషయంలో తప్పు అంతా వంశీ పైడిపల్లిదే అయ్యుంటుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అన్ని మ్యూజిక్ సిట్టింగులు వేసి కూడా ఇలాంటి పాటలేంటో అర్ధం కాని పరిస్థితి. ఏదేమైనా డైరెక్టర్ ను బట్టే మ్యూజిక్ డిపెండ్ అయ్యి ఉంటుందని ఇదో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం మొదట్లో వచ్చిన ‘వినయ విధేయ రామ’ చిత్రానికి కూడా దేవి శ్రీ మ్యూజిక్ మైనస్ అయ్యింది. అయితే బోయపాటికి కూడా మ్యూజిక్ సెన్స్ అంత లేదు కాబట్టి అలాంటి పాటలు వచ్చాయి. కానీ దిల్ రాజు లాంటి నిర్మాత.. వంశీ పైడిపల్లి వంటి డైరెక్టర్ ఉండి కూడా ‘మహర్షి’ మ్యూజిక్ ఫెయిలయ్యింది. మెయిన్ గా వంశీ పైడిపల్లి దే అసలు తప్పు అని ఫిలింనగర్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక మరో రెండు రోజుల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది కాబట్టి ట్రైలర్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ ట్రైలర్ అయినా ఆకట్టుకునేలా ఉంటే… ఈ మ్యూజిక్ ఫెయిల్యూర్ ను మర్చిపోవచ్చు. మరి అదెలా ఉండబోతుందో…!