Balagam: బలగం నటీనటులను మెచ్చుకున్న మంచు ఫ్యామిలీ.. కానీ?

  • April 4, 2023 / 09:16 PM IST

ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల మనస్సులను కదిలించిన సినిమా ఏదనే ప్రశ్నకు బలగం సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది. జబర్దస్త్ వేణు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా 25 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చింది. ఈ సినిమా చూసి విడిపోయిన వాళ్లు సైతం కలవడం గమనార్హం.
అయితే మంచు మోహన్ బాబు, మంచు విష్ణు బలగం యూనిట్ ను సత్కరించారు.

బలగం సినిమాను మెచ్చుకోవడంతో పాటు ఈ సినిమాలో నటించిన నటీనటులు ప్రియదర్శి, దర్శకుడు వేణుకు అభినందనలు తెలిపారు. బలగం సినిమాను చూసిన మోహన్ బాబు, విష్ణు ఈ సినిమాను మెచ్చుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు. సినిమా అద్భుతంగా ఉందని వాళ్లు మెచ్చుకున్నారు. సాయిలు కూతురు రోల్ ను పోషించిన రూపాలక్ష్మిని సైతం మంచు ఫ్యామిలీ సన్మానించడం గమనార్హం.
ఈ మధ్య కాలంలో కొన్ని కామెంట్ల వల్ల మంచు ఫ్యామిలీపై ఒకింత నెగిటివిటీ పెరగగా మంచు ఫ్యామిలీ మంచి కార్యక్రమాల ద్వారా పాజిటివిటీని అంతకంతకూ పెంచుకుంటున్నారు.

బలగం (Balagam) సినిమా ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకుంటూ వార్తల్లో నిలుస్తోంది. అయితే మంచు ఫ్యామిలీకి చెందిన మనోజ్, మంచు లక్ష్మి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఉంటే బాగుండేది. మరోవైపు జిన్నా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో మంచు విష్ణు కెరీర్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంచు మనోజ్ కెరీర్ పరంగా బిజీ అవుతుండగా వాట్ ది ఫిష్ సినిమాలో మనోజ్ నటిస్తున్నారు.

మంచు లక్ష్మి సినిమాలకు దూరంగా ఉంటున్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. మంచు ఫ్యామిలీ హీరోల సినిమాలు, షోలు సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మోహన్ బాబు కీలక పాత్రలో నటించిన శాకుంతలం మూవీ మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus