ప్రభాస్ డ్రీమ్ ప్రాజెక్ట్ ని తన్నుకుపోయిన మంచు హీరో

మంచు విష్ణు ప్రభాస్ డ్రీమ్ ప్రాజెక్ట్ తన్నుకుపోయాడు. ఆ చిత్రం తాను చేస్తున్నట్లు ప్రకటించేశారు. నిన్న మహా శివరాత్రి పురస్కరించుకొని మోహన్ బాబు శ్రీకాళహస్తి సన్నిధానంలో 60కోట్ల బడ్జెట్ తో భక్త కన్నప్ప చిత్రం మంచు విష్ణు హీరోగా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది. ఐతే భక్త కన్నప్ప మూవీ అనేది హీరో ప్రభాస్ డ్రీమ్ ప్రాజెక్ట్ . తన పెద్ద నాన్న కృష్ణం రాజు నటించిన చిత్రాలలో భక్త కన్నప్ప ఒక మరపురాని చిత్రంగా ఉంది. లెజెండరీ దర్శకుడు బాపు దర్సకత్వంలో 1976లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో పాటు, అవార్డు విన్నింగ్ మూవీగా నిలిచింది.

ఇక ఈ చిత్రాన్ని ప్రభాస్ చేస్తే చూడాలని ఉంది అని కృష్ణం రాజు అనేక వేదికలపై చెప్పడం జరిగింది. ప్రభాస్ సైతం భక్త కన్నప్ప చిత్రంలో నటించడం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ చిత్రాన్ని మంచు విష్ణు హీరోగా నిర్మించడానికి సిద్ధం కావడంతో ప్రభాస్ ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. మరి ఈ విషయం పై ప్రభాస్ మరియు కృష్ణం రాజులు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక ప్రస్తుతం ప్రభాస్ రాధా కృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్ లవ్ డ్రామాలో నటిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఇటీవలే తాజా షెడ్యూల్ మొదలుకాగా హీరో ప్రభాస్ మరియు పూజ హెగ్డే పాల్గొంటున్నారు.

Most Recommended Video

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus