రాఖీ పౌర్ణమి సందర్భంగా సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున రాఖీ పండుగను జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా రాఖీ పౌర్ణమి సందర్భంగా సెలబ్రిటీలందరూ కూడా రాఖీ పౌర్ణమి వేడుకకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంచు లక్ష్మి సైతం రాఖీ పండుగ సెలబ్రేషన్స్ ఎంతో ఘనంగా జరుపుకున్నారని తెలుస్తోంది. ఈమె తన తమ్ముడు మంచు మనోజ్ కు రాఖీ కట్టి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఇకపోతే మనోజ్ భార్య భూమా మౌనిక రెడ్డి తన సోదరుడు విఖ్యాత్ రెడ్డికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇలా ఈ నలుగురు కలిసి రాఖీ పౌర్ణమి వేడుకలలో పాల్గొనడమే కాకుండా నలుగురు రెస్టారెంట్ కు వెళ్లి భారీగా ఈ వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను లక్ష్మీ ప్రసన్న సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసినటువంటి నేటిజన్స్ ఈ ఫోటోలపై వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు మంచు మనోజ్ కు రాఖీ కట్టావు సరే మరి విష్ణు పరిస్థితి ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
విష్ణు కూడా (Manchu Lakshmi) లక్ష్మీ ప్రసన్నకు సోదరుడే అయినప్పటికీ ఈమె కేవలం మంచు మనోజ్ తో మాత్రమే ఈ పండుగను జరుపుకోవడంతో పెద్ద ఎత్తున విష్ణుకు రాఖీ ఎందుకు కట్టలేదు అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా మంచు లక్ష్మి మనోజ్ తో మాత్రమే ఈ పండుగను జరుపుకోవడంతో బహుశా మంచు లక్ష్మి మనోజ్ అలాగే విష్ణు మధ్య మనస్పర్ధలు వచ్చాయని
అందుకే ఈమె మనోజ్ కి మాత్రమే రాఖీ కట్టడమే కాకుండా ఎక్కడికి వెళ్లినా లక్ష్మి మనోజ్ మౌనిక మాత్రమే కలిసి వెళ్తున్నారు. ఇక విష్ణు వీరితో ఈ మధ్యకాలంలో కనిపించిన సందర్భాలు కూడా లేవు దీంతో ఇద్దరి మధ్య మరోసారి బేధాభిప్రాయాలు వచ్చాయనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?
మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!