Manchu Lakshmi: బాలయ్య పాటకు మంచి లక్ష్మీ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో!

మంచు మోహన్ బాబు కుమార్తెగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ… మొదట కొన్ని టాక్ షోలు చేసి ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తన నటనతో మెప్పించింది కానీ.. సినిమాలు నిరాశపరచడంతో…. ఈమె నటిగా స్థిరపడలేకపోయింది. తనకు కలిసొచ్చిన టాక్ షోలు చేస్తూ వచ్చింది ఈ మధ్య కాలంలో అది కూడా మానేసింది. అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తోంది. ఈ మధ్యనే మోహన్ లాల్ నటించిన మాన్స్టర్ మూవీలో నటించింది.

ఆ మూవీలో ఈమె లెస్బియన్ రోల్ లో కనిపించి షాక్ ఇచ్చింది. ఇదిలా ఉండగా… అప్పుడప్పుడు డాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది మంచు లక్ష్మీ. సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రంలోని మా భావ మనోభావాలు పాటలో నర్తించి వార్తల్లో నిలిచింది మంచు లక్ష్మి. ఈ పాటలో మాస్ స్టెప్పులతో అలరించింది.

వీరసింహారెడ్డి చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు కూడా ఈ వీడియోతో పాటు రాసుకొచ్చి పోస్ట్ చేసింది ఈ మంచు వారి అమ్మాయి. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి:

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus