నెటిజనులతో సరదాగా మాట్లాడిన మంచు లక్ష్మి

“నా రూటే వేరు…” అని డైలాగ్ కింగ్ మోహన్ బాబు అన్నట్టు.. అతని కుమార్తె మంచు లక్ష్మి కూడా డిఫెరెంట్ రూట్ లో వెళుతుంటుంది. సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడు టీవీ షోలు చేస్తుంటుంది. టీవీ హోస్ట్ గా అదరగొడుతున్నప్పుడు సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటుంది. అయితే ఎందులో అడుగుపెట్టినా విజయం సాధించడం ఆమె నైజం. దసరా సందర్భంగా ట్విట్టర్ వేదికపై ఆమె అభిమానులతో ముచ్చటించింది. వారు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానం చెప్పింది. “ఇదివ‌ర‌కూ శ్రీ‌రెడ్డి లైంగిక వేధింపుల వ్య‌వ‌హారం గురించి మాట్లాడిన‌ప్పుడు త‌న‌కు స‌పోర్టునివ్వ‌కుండా .. అస‌లు కాస్టింగ్ కౌచ్ అన్న‌దే లేద‌ని అన్నారు. కానీ చిన్మ‌యి ఈ వేధింపుల్లో బ‌య‌ట‌ప‌డితే త‌నకు మాత్రం స‌పోర్టునిస్తున్నారు” అని ఓ నెటిజన్ ప్రశ్నించగా… తెలివిగా సమాధానమిచ్చింది. “త‌ప్పు జ‌రిగితే నేనెపుడూ వ్య‌తిరేకిస్తాను.

వాయిస్ ఆఫ్ ఉమెన్ (వావ్‌) తో మ‌హిళ‌లు ధైర్యంగా స‌మ‌స్య‌ల్ని చెప్పుకోవ‌చ్చు. ఈ ప్ర‌పంచాన్ని బెట‌ర్‌గా తయారు చేద్దాం“ అని వెల్లడించింది. మీరు ప‌ని చేసిన‌ ద‌ర్శ‌కులంద‌రి నుంచి మీరేం నేర్చుకున్నారు?“ అంటూ జ‌న‌సేన కార్య‌క‌ర్త ప్ర‌శ్నిస్తే.. “తేలిక ప్రశ్నలు అడగవోయ్ “ అంటూ ల‌క్ష్మీ సరదాగా సమాధానమిచ్చింది. ప‌వ‌న్‌తో `నేను సైతం` ఎపిసోడ్ చేయొచ్చు క‌దా? అని ఓ అభిమాని ప్ర‌శ్నిస్తే.. “చాలాసార్లు అడిగాను. కానీ అట్నుంచి రిప్లయ్ లేదు” అని మంచు లక్ష్మి స్పష్టంచేశారు. మొత్తానికి లౌక్యంగా సమాధానాలు ఇచ్చి వివాదాలకు దూరంగా దసరాని జరుపుకుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus