Manchu Lakshmi: భాష పరంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాను.. మంచు లక్ష్మి కామెంట్స్ వైరల్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి మంచు వారసురాలిగా అడుగుపెట్టిన మంచు లక్ష్మి ఇండస్ట్రీలో నటిగా యాంకర్ గా నిర్మాతగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే తాజాగా ఈమె మలయాళ నటుడు మోహన్లాల్ నటించిన మాన్ స్టర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతుంది. ఇక ఈ సినిమాలో మంచు లక్ష్మి మంజు దుర్గ అనే పాత్రలో నటించారు. ఈ సినిమాలో మంచు లక్ష్మి పాత్ర ఒక లెస్బియన్ పాత్ర కావడం విశేషం.

ఇలా ఇలాంటి పాత్రలో నటించి మంచు లక్ష్మీ నటనలో మరో లెవెల్ కు వెళ్లిందని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతున్న నేపథ్యంలో ఈమె ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను ఎంతో హుషారుగా లొకేషన్ లోకి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇందులో చాలా మూడిగా కనిపించాలని చెప్పేవారు.

ఇక తన పాత్రను ఆ లాంగ్వేజ్ ను అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పట్టిందని మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డానని తెలిపారు.ఇక ఈ సినిమాలో డైలాగులు కాస్త లెంతీగా ఉండటం వల్ల భాషాపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నానని మంచు లక్ష్మి తెలిపారు.ఇక ఈ సినిమాలో నటించిన మోహన్ లాల్ గురించి మాట్లాడుతూ ఆయన ఒక లెజెండరీ నటుడు అంటూ తనపై ప్రశంసలు కురిపించారు. మోహన్ లాల్ గారు ఒక నటుడు మాత్రమే కాదు ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఎన్నో ప్రయోగాత్మక సినిమాలను చేశారు.

తన సినీ కెరియర్లో ఇప్పటికీ ఇలాంటి ఛాలెంజింగ్ పాత్రలలో నటిస్తున్నారని తెలిపారు ఈ క్రమంలోనే తనతో కలిసి ప్రతి ఏడాదికి ఒక సినిమా చేయాలని ఉంది అంటూ తనతో తన అభిప్రాయాన్ని పంచుకున్నానని ఈమె వెల్లడించారు.ఈ వయసులో కూడా మోహన్ లాల్ గారు ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలలో నటించాల్సిన పనిలేదు కానీ ఆయన ఇలాంటి పాత్రలను ఒక ఛాలెంజ్ గా తీసుకొని నటిస్తున్నారంటూ ఈ సందర్భంగా ఈమె మోహన్ లాల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus