Manchu Lakshmi: ముంబైలో మంచు లక్ష్మి ఇంటిని చూశారా ఎంత అందంగా ఉందో?

  • January 8, 2024 / 07:49 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు వారసురాలిగా పలు సినిమాలలో విభిన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన నటి మంచు లక్ష్మి ప్రస్తుతం హైదరాబాదు వదిలి ముంబై షిఫ్ట్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఈమె ముంబై షిఫ్ట్ అవ్వడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. తన కూతురు భవిష్యత్తు కోసం ఈమె ముంబై వెళ్లారు అదేవిధంగా అక్కడ కూడా సినిమాలలో నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కూడా మంచు లక్ష్మి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే మంచు లక్ష్మీ ప్రస్తుతం ముంబైలో సినిమాలు వెబ్ సిరీస్లలో అవకాశాల కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక ఈమె కెరియర్ పరంగా బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే గతంలో ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తిరుపతిలో వాళ్లు ఉన్నటువంటి ఇల్లు అలాగే హైదరాబాద్లో తన ఇంటితో పాటు తన తండ్రి మోహన్ బాబు ఇంటిని కూడా ఈమె అభిమానులకు చూయించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె ముంబైలో ఉండడంతో తన ముంబై హోం టూర్ వీడియోని కూడా అభిమానుల కోసం షేర్ చేశారు తాను ఈ ఫ్లాట్ కోసం దాదాపు వారం రోజులపాటు తిరిగానని అయితే నాకు ఈ ఫ్లాట్ నచ్చిందని ఈమె తెలిపారు. ఇక ఈ ఫ్లాట్ చాలా యూనిక్ గా డిజైన్ చేసుకున్నారని చెప్పాలి. ఈ ఫ్లాట్ కోసం నేను హైదరాబాద్ నుంచే వస్తువులన్నింటినీ తెప్పించుకున్నానని ఈమె తెలిపారు. ఇలా బెడ్ రూమ్ హాల్ అలాగే తన ఇంట్లో వస్తువులన్నింటినీ కూడా ఈమె ఈ వీడియోలో చూపించారు.

ఇక తన కెరీర్ గురించి కూడా మాట్లాడుతూ నేను టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కిడ్ కానీ బాలీవుడ్ ఇండస్ట్రీకి కాదని ఇక్కడ నేను నా టాలెంట్ నిరూపించుకునే అవకాశాలు అందుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అయితే ఇప్పటికే కొన్ని ఆఫీస్ లో నుంచి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని త్వరలోనే ఆడిషన్ కి కూడా వెళ్తాను అంటూ ఈమె (Manchu Lakshmi) చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus