మోహన్ బాబు వారసురాలుగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు నటిగా పరిచయమయ్యారు మంచు లక్ష్మి. ఈమె హీరోయిన్గా పలు సినిమాలలో నటించారు అదేవిధంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈమె ముంబైలో నివాసం ఉంటూ బాలీవుడ్ సినిమా అవకాశాల కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈమె ముంబై వెళ్ళిన తర్వాత తన వేషధారణ పూర్తిగా మార్చేసారని చెప్పాలి. ఇటీవల ఈమె బికినీలో కనిపించి సందడి చేయడమే కాకుండా స్విమ్ సూట్ ధరించి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
అయితే కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన అటువంటి తరుణంలో మంచు లక్ష్మి కూడా ఫుడ్ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. ఇకపై తాను రైస్ అలాగే నాన్ వెజ్ అసలు ముట్టుకోనని వీటిని తినడం పూర్తిగా మానేస్తున్నాను అంటూ ఈమె తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. అయితే మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాము అంటే ఆ నిర్ణయాన్ని అందరికీ తెలిసేలా చేయాలి అంటూ అల్లు అర్జున్ ఇచ్చిన సలహాతో ఈ విషయాన్ని అందరికీ షేర్ చేస్తున్నానని ఈమె తెలిపారు.
ఇలా తాను ఇకపై రైస్ నాన్ వెజ్ తినను అంటూ ఈమె (Manchu Lakshmi) చేసినటువంటి ఈ పోస్టుపై అల్లు అర్జున్ స్పందిస్తూ ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. మంచు లక్ష్మి ఫుడ్ లవర్ అనే విషయం మనకు తెలిసిందే ఈమె ఎక్కడికైనా వెళ్తే ఆ ఏరియాలో స్పెషల్ ఏంటో కనుక్కొని మరి తింటూ ఉంటారు అలాంటి ఈమె రైస్ ,నాన్ వెజ్ తినకుండా ఉంటానని పోస్ట్ చేయడంతో నేటిజన్స్ ఇది కష్టమే కదా లక్ష్మక్క అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి ఈమె ఎన్ని రోజులపాటు ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటారో తెలియాల్సి ఉంది.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!