నందమూరి అభిమానుల మనసు గెలుచుకున్న మంచు మనోజ్

స్నేహానికి అర్ధం ఒక్క మాటలో చెప్పమంటే కష్టం అవుతుంది. కానీ ఒక్క రోజులో మంచు మనోజ్ స్నేహానికి అర్ధాన్ని అందరికీ తెలిసేలా చేసాడు. నిజమైన స్నేహితుడు సంతోష సమయంలో పక్కన ఉండడం మాత్రమే కాదు.. కష్టాల్ని పంచుకోవాలి. బలహీనమైనప్పుడు ధైర్యాన్ని ఇవ్వాలి. రక్షణగా నిలబడాలి. ఇలా అన్ని రకాల చేసి మనోజ్ నిజమైన స్నేహితుడు అనిపించుకున్నారు. మొన్న రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. చైతన్య రథ సారథిగా తెలుగువారి హృదయాల్లో శాశ్వతంగా స్థానం సంపాదించిన హరికృష్ణ అంత్యక్రియలు నిన్న జూబ్లీ హిల్స్ మహాప్రస్థానంలో జరిగాయి. హరికృష్ణ తనయులు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు కుంగిపోయారు. ఈ సమయంలో చాలామంది ఆప్తులు నందమూరి అన్నదమ్ములకు అండగా నిలబడ్డారు.

ఎన్టీఆర్ కు మంచు మనోజ్ చాలా క్లోజ్ ఫ్రెండ్ అనే విషయం తెలిసిందే. అంతే కాదు నందమూరి కుటుంబంతో మంచు ఫ్యామిలీ వారి స్నేహం ఎప్పటినుంచో ఉంది. దాంతో నిన్న ఎన్టీఆర్ కు మంచు మనోజ్ బాసటగా నిలిచాడు. అంతిమ యాత్ర సమయంలో ఫ్యాన్స్ తాకిడి ఎక్కువగా ఉండడంతో వారు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మీదకు రాకుండా కంట్రోల్ చేస్తూ అన్నదమ్ములకు ఇబ్బంది లేకుండా చూడడం అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో మనోజ్ ను నందమూరి అభిమానులు ప్రశంసిస్తున్నారు. ట్విట్టర్ లో ఎన్టీఆర్, మనోజ్ కలిసి ఉన్న ఫోటోలు పోస్ట్ చేసి క్లిష్ట సమయంలో తోడుగా నిలిచినందుకు థ్యాంక్స్ చెబుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా నిండా మనోజ్ పడిన కష్టానికి చెందిన ఫొటోలే కనిపిస్తున్నాయి. నెటిజనులు సైతం మనోజ్ స్నేహానికి నిదర్శనంగా నిలిచారని అభినందిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus