అక్కకి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన మనోజ్

నటిగా, నిర్మాతగా, హోస్ట్ గా మంచు లక్ష్మి విజయం సాధించింది. అంతేకాదు వివిధ అవార్డుల కార్యక్రమాల్లో వేదికలపై యాంకర్ గా తనదైన శైలిలో మాట్లాడి ఆకట్టుకుంది. తనతండ్రి మోహన్ బాబు మాదిరిగా విలన్ పాత్రలో మెప్పించి హీరోయిన్ గా కవ్వించింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పించింది. నిన్న ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమెకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సెలబ్రిటీలు కూడా విషెష్ చెప్పారు. మంచు లక్ష్మి తమ్ముడు మనోజ్ కూడా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. “నాకు తల్లి తర్వాత తల్లి అయిన అక్కకి ప్రత్యేకమైన పుట్టిన రోజు శుభాకాంక్షలు.

నువ్వు చాలా ఆనందంగా సంతోషంగా ఉండాలి అక్క. సాధ్యమైనంత వరకు మనం సాయం చేద్దాం. నీకు శుభం జరగాలి. నీవు లేకపోతే నేను లేను” అని మనోజ్ పోస్ట్ చేశారు. అతని విషెష్ మంచు ఫ్యామిలీ అభిమానులతో పాటు నెటిజనులను ఆకట్టుకుంది. ప్రస్తుతం మంచు లక్ష్మి బాలీవుడ్ మూవీ తుమ్హారీ సులు రీమేక్ కాట్రిన్ మొజిలో నటిస్తోంది. జ్యోతిక ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో లక్ష్మి రేడియో ఛానల్ హెడ్ గా నటిస్తోంది. ఈ సినిమా తమిళంలోనే కాకుండా.. తెలుగులోనూ రిలీజ్ కానుంది. ఈ రోల్ మంచు లక్ష్మికి మంచి గుర్తింపును తీసుకు రానుందని చిత్ర బృందం చెప్పింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus