Manchu Manoj: కొత్తింట్లో సాయి ధరమ్ తేజ్ అండ్ ఫ్రెండ్స్ కు పార్టీ ఇచ్చిన మంచు మనోజ్.. ఫోటోలు వైరల్!

మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి ల వివాహం మార్చ్ 3న మంచు లక్ష్మీ ఇంట్లో ఘనంగా జరిగింది.వీరి పెళ్లి గురించి ఎన్నో వార్తలు హల్ చల్ చేశాయి. మౌనికతో వివాహానికి మనోజ్ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని.. మరీ ముఖ్యంగా మంచు విష్ణుకి – మనోజ్ కి మధ్య ఈ విషయంలో చాలా గ్యాప్ వచ్చిందని ప్రచారం జరిగింది. మంచు విష్ణు కూడా మనోజ్- మౌనిక ల పెళ్లిలో ఎక్కువ సేపు ఉండలేదు కాబట్టి.. ఈ వార్తలు మరింతగా పెరిగాయి.

అయితే ఫైనల్ గా (Manchu Manoj) మనోజ్ – మౌనిక ల వివాహాన్ని దగ్గరుండి అంగరంగ వైభవంగా జరిపించింది మనోజ్ సోదరి మంచు లక్ష్మీ. ఇక మనోజ్ – మౌనిక లు ఇటీవల కొత్తింట్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన స్నేహితులకు అలాగే సాయి ధరమ్ తేజ్ కు మంచి పార్టీ ఇచ్చాడు మంచు మనోజ్. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనోజ్ – సాయి ధరమ్ తేజ్ లకు ఉన్న ఫ్రెండ్ షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఇటీవల సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ మూవీ రిలీజ్ అయ్యి, సూపర్ సక్సెస్ అందుకుంది. దీంతో సాయి ధరమ్ తేజ్ ను ప్రత్యేకంగా అభినందించి ఈ పార్టీని హోస్ట్ చేసినట్టు కూడా మనోజ్ తెలిపాడు. అలాగే సీనియర్ నటుడు నరేష్ కొడుకు నవీన్ అద్భుతంగా బిర్యానీ వండిపెట్టాడు.. థాంక్స్ అంటూ కూడా మనోజ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.


రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus