తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో కమెడియన్ గా వివేక్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. వివేక్ ఆకస్మిక మరణం వివేక్ ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటీలను కలచివేసింది. సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు వివేక్ మృతికి సంతాపం తెలుపుతున్నారు. అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వివేక్ కెరీర్ లో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు. ప్రముఖ దర్శకుడు కే బాలచందర్ వివేక్ ను నటుడిగా పరిచయం చేశారు. తక్కువ సమయంలోనే మంచి పేరును సంపాదించుకున్న వివేక్ హాస్యం ద్వారా సమాజానికి సందేశాలు ఇచ్చారు.
సౌత్ ఇండియాలో చాలామంది స్టార్ హీరోలతో కలిసి నటించిన వివేక్ కు కమల్ హాసన్ తో కలిసి నటించి స్క్రీన్ పై చూసుకోవాలనే కోరిక ఉండేది. కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇండియన్ 2 సినిమాలో వివేక్ నటించారు. ఆ సినిమా విడుదల కాకముందే వివేక్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కల తీరకుండానే వివేక్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటూ ఈరోజు ఉదయం మృతి చెందారు. ఒకవైపు కమెడియన్ గా సినిమాల్లో నటిస్తూనే వెల్డై క్లపూల్ అనే సినిమాలో వివేక్ హీరోగా నటించారు. వివేక్ మరణం భారతీయ సినిమాకు తీరని లోటు అని తెలుగు హీరో మంచు మనోజ్ ట్వీట్ చేశారు.
వివేక్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని మనోజ్ పేర్కొన్నారు. వివేక్ నటించిన ఎన్నో సినిమాలకు అవార్డులు, రివార్డులు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం వివేక్ సినిమా రంగానికి చేసిన సేవలకు పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాల్లో వివేక్ ఎక్కువగా నటించారు.
Most Recommended Video
‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!