మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 3న అంటే ఈరోజు రాత్రి 8 గంటల 30 నిమిషాలకు మనోజ్ – మౌనిక ల పెళ్లి జరగనుంది. మనోజ్ రెండో పెళ్లి చేస్కోబోతున్న అమ్మాయి ఎవరో అందరికీ తెలుసు కదా. దివంగత టీడీపీ నేత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె. వీరిద్దరూ చాలా కాలంగా కలిసుంటున్నట్టు వార్తలు వినిపించాయి. మౌనికకి కూడా ఇది వరకు పెళ్లయింది.
కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకుని సెపరేట్ గా జీవిస్తుంది. మౌనిక మొదటి పెళ్ళికి కూడా మనోజ్ గెస్ట్ గా వెళ్ళాడు. అంతకు ముందు నుండే వీరి మధ్య స్నేహం ఉంది. అయితే మనోజ్ నిజంగానే మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకోబోతున్నాడా? అని కొంతమంది డిస్కస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మంచు ఫ్యామిలీ ఈ విషయం పై అధికారికంగా స్పందించింది లేదు. కానీ మనోజ్ మాత్రం కొన్ని పోస్ట్ లు పెట్టి మౌనిక రెడ్డిని వివాహం చేసుకోబోతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు.
అలాగే మనోజ్ – మౌనిక రెడ్డి ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మంచు లక్ష్మీ ఇంట్లో మొదలైనట్టు కూడా ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి మంచు లక్ష్మీ ఓ మెహందీ పిక్ అలాగే సంగీత్ కు సంబంధించిన పిక్ షేర్ చేసింది. ఇక మనోజ్ ‘పెళ్లి కూతురు’ అంటూ మౌనిక ఫోటోని షేర్ చేశాడు. దానికి ‘మనోజ్ వెడ్స్ మౌనిక’ ‘ఎం వెడ్స్ ఎం’ అనే హ్యాష్ ట్యాగ్ లను కూడా జత చేశాడు.
ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!
స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!