Manchu Manoj: దసరాకు టార్గెట్ సెట్ చేసుకున్న మంచు మనోజ్!

Advertisement

2017లో వచ్చిన ఒక్కడు మిగిలాడు మూవీ ద్వారా చివరిగా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మంచు మనోజ్, ఆ తరువాత ఆపరేషన్ 2019 మూవీలో చిన్న క్యామియో అపియరెన్స్ ఇచ్చారు. ఇక ఆ తరువాత తన పేరుతో సొంత సంస్థగా ఎం ఎం ఆర్ట్స్ ని ప్రారంభించి యువ దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి తో మంచు మనోజ్ ప్రారంభించిన సినిమా అహం బ్రహ్మాస్మి. చాలావరకు షూటింగ్ జరుపుకునున్న ఈ సినిమా ఇటీవల కరోనా కారణంగా కొన్నాళ్లుగా వాయిదా పడింది.

అయితే మనోజ్ పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పారు అంటూ మధ్యలో వార్తలు రావడంతో అవన్నీ నిజం కావు, త్వరలో అహం బ్రహ్మాస్మి షూటింగ్ బ్యాలెన్స్ పార్ట్ ప్రారంభించి వీలైనంత త్వరలో దానిని రిలీజ్ చేస్తాం అని ఇటీవల మనోజ్ క్లారిటీ ఇచ్చారు. అయితే లేటెస్ట్ గా పలు టాలీవుడ్ వర్గాల నుండి వైరల్ అవుతన్న న్యూస్ ప్రకారం కొద్దిరోజల క్రితం తెలంగాణ టూరిజం మినిస్టర్ ని కలిసి వారితో ప్రత్యేకంగా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన మనోజ్, తదుపరి సొంతంగా ఒక భారీ ప్రాజక్ట్ కోసం సిద్ధం అవుతున్నారని, భారీ స్థాయిలో అది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఛాన్స్ ఉందని అంటున్నారు.

అలానే ముఖ్యంగా రాబోయే దసరా పండుగ రోజున ఆయన సినిమాకు సంబంధించి ఒక బిగ్ అనౌన్స్ మెంట్ కూడా ఉండనుందట. ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు కదా అని అనుకోవద్దు, ఆరోజున వయొలెంట్ అనౌన్స్ మెంట్ కోసం సిద్ధం అవ్వండి అంటున్నారట. మరి మనోజ్ నుండి ఆరోజున రానున్న అనౌన్స్ మెంట్ ఏంటో తెలియాలి అంటే మరొక నెలన్నవరకు వెయిట్ చేయాల్సిందే.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus