కూలీగా మారిన మంచు మనోజ్..!!

కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో టాలీవుడ్ స్టార్లు ఎల్లప్పుడూ ముందుంటారు. తమ వంతు సాయం చేస్తుంటారు. నిర్మాత, నటి మంచు లక్ష్మీసాయం చేసే వారులేక రోడ్డున పడ్డ ఎన్నో కుటుంబాలలో వెలుగులు నింపుతోంది. “లక్ష్మితో మేము సైతం” అనే కార్యక్రమం ద్వారా డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుమార్తె అభాగ్యులకు అండగా నిలుస్తోంది.

ఈ షోలో మాస్ మహారాజా రవితేజ, నాని, కాజల్, రెజీనా, రకుల్ ప్రీత్ సింగ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొని, ప్రజల్లోకి వచ్చి పేదలను ఆదుకోవడానికి నిధులను సేకరించారు. ప్రముఖ యాంకర్ సుమ కూడా జోతిష్యం చెప్పి డబ్బులు పోగు చేసి దిక్కులేని వారికి సహాయం అందించింది. రీసెంట్ గా సెల్ఫీ రాజా అల్లరి నరేష్ కూడా కొబ్బరి బొండాలు అమ్మి వచ్చిన డబ్బులను ఇబ్బందుల్లో కుటుంబానికి అందజేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలనే కాకుండా తారలను కదిలిస్తున్న ఈ షో కోసం మంచు మనోజ్ కూలీ అయ్యారు.

శనివారం హైదరాబాద్ లోని మహాత్మా గాంధీ బస్టాండ్ లో బరువులు ఎత్తారు. మనోజ్ ను చూసేందుకు అభిమానులు ఎక్కువ సంఖ్యలో తరలి వచ్చారు. కష్టపడి సంపాదించిన కూలీ డబ్బులను దరిద్రంలో కొట్టుమిట్టాడుతున్న మరో కుటుంబానికి “లక్ష్మితో మేము సైతం” షోలో మనోజ్ అందివ్వనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus