అభిమాని ప్రశ్నకు సరదాహాగా సమాధానమిచ్చిన మంచు మనోజ్

నటుడు అంటే అన్ని రకాల పాత్రలు పోషించాలని డైలాగ్ కింగ్ మోహన్ బాబు భావిస్తుంటారు. అదే విధంగా అతని చిన్న తనయుడు మంచు మనోజ్ ఆలోచిస్తుంటారు. అందుకే విబ్భిన్న కథలను ఎంచుకుంటున్నారు. నేను మీకు తెలుసా?, ప్రయాణం, వేదం వంటి చిత్రాల ద్వారా తన అభిరుచిని చాటుకున్నారు. తనకి పారితోషికం పెంచే పాత్రలు కన్నా.. సంతృప్తిని అందించే రోల్స్ ఎంచుకొని, అందుకోసం కష్టపడుతుంటారు. అయితే మంచు మనోజ్ నటించిన గత చిత్రాలు శౌర్య, అటాక్, గుంటూరోడు, ఒక్కడు మిగిలాడు వంటివి ఆశించినంతగా విజయం సాధించలేదు. దీంతో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చారు.

ఆ విషయాన్ని ఓ అభిమాని ట్విట్టర్ వేదికపై అతన్ని అడిగారు. “అన్నా మీరు మూవీస్ చేయడం లేదు ఎందుకు?”’ అని అభిమాని అడగ్గా…అందుకు మంచు మనోజ్ “తిక్క” అని సరదాగా సమాధానం ఇచ్చారు. “తిక్కనా? ఏ ఎందుకు అన్నయ్య” అని మరొకరు ప్రశ్నించగా… “చెప్తా చెప్తా అన్నీ సమయం వచ్చినపుడు చెప్తా” అని రిప్లై ఇచ్చారు. “ఆ టైం ఎప్పుడొస్తుందో ఏంటో మనోజ్ అన్న” అని ఇంకొకరు అసహనం వ్యక్తం చేయగా… నవ్వుతున్న ఎమోజీలను మనోజ్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్విట్టర్ సంభాషణ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే మనోజ్ మంచి ప్రేమకథతో రావాలని అటువంటి కథలను వింటున్నట్లు ఫిలిం నగరవాసులు చెప్పారు. ఆ కథ ఫైనల్ కాగానే అధికారికంగా ప్రకటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus