Manchu Vishnu: ‘ఎవరో కావాలనే నాపై నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు’: మంచు విష్ణు

టాలీవుడ్ హీరో, నిర్మాత, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు త్వరలోనే ‘జిన్నా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 21న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నారు విష్ణు. ఈ క్రమంలో ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ లేటెస్ట్ సినిమా ‘ఆదిపురుష్’పై మంచు విష్ణు కామెంట్ చేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయం మంచు విష్ణు వరకు వెళ్లింది.

వెంటనే తన ట్విట్టర్ ద్వారా ప్రభాస్ ఫ్యాన్స్ కు వివరణ ఇచ్చారు. అసలేం జరిగిందంటే..? ‘ఆదిపురుష్’ మేకర్స్ ప్రభాస్ ని, ప్రేక్షకులను మోసం చేశారని విష్ణు కామెంట్స్ చేసినట్లుగా మీడియాలో వార్తలొచ్చాయి. ‘ఆదిపురుష్’ సినిమాలో విజువల్స్ చూస్తే కార్టూన్ సినిమా చూసినట్లు అనిపించిందని.. ఆడియన్స్ ప్రిపేర్ చేయకుండా ఇలా మోసం చేయాలని చూస్తే రియాక్షన్ ఇలానే ఉంటుందని మంచి విష్ణు మాట్లాడినట్లుగా వార్తలొచ్చాయి. దీనిపై రియాక్ట్ అయిన విష్ణు.. ‘అదొక ఫేక్ న్యూస్.

ఎవరో ఐటెం రాజా.. ‘జిన్నా’ సినిమా రిలీజ్ కంటే ముందు ఆ ఫేక్ న్యూస్ ను స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. నా సోదరుడు డార్లింగ్ ప్రభాస్ గురించి నేనెందుకు అలా మాట్లాడతాను’ అంటూ ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో మంచు ఫ్యామిలీపై ట్రోలింగ్ బాగా ఎక్కువైంది.

ముఖ్యంగా మంచు విష్ణుని బాగా టార్గెట్ చేస్తున్నారు. అతడిపై రకరకాల ట్రోల్స్, మీమ్స్ వస్తున్నాయి. ఈ విషయంలో సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చారు విష్ణు. వారిచ్చిన ఐపీ అడ్రెస్ ప్రకారం.. తనపై ఓ స్టార్ హీరో ట్రోల్స్ చేయిస్తున్నట్లు తెలిసిందని మీడియా వేదికగా వెల్లడించారు. ఇప్పుడు మరోసారి ఆయన్ను టార్గెట్ చేయడంతో సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus