కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు గారి పెద్దబ్బాయిగా సినీ పరిశ్రమకి అడుగుపెట్టిన మంచు విష్ణు హీరోగానే కాకుండా పలు సినిమాలకి నిర్మాతగా కూడా వ్యవహరించాడు. అయితే ఇతను స్టార్ అవ్వలేకపోయాడు. మంచి సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఇతను ఎందుకు స్టార్ అవ్వలేదు? ఇదే విషయాన్ని.. తాజాగా ‘అలీతో సరదాగా’ షోలో ప్రస్తావించాడు అలీ. దాని విష్ణు సమాధానం ఇస్తూ.. ‘నా సినీ కెరీర్లో నేను చేసిన పెద్ద తప్పు.. పెద్ద డైరెక్టర్లతో వర్క్ చేయకపోవడం’ అంటూ అతను చెప్పుకొచ్చాడు.
ఎందుకు అలా? అని అలీ ప్రశ్నించగా.. ‘నా ఫూలిష్నెస్ అలాగే నేను సెంటిమెంటల్’ అంటూ సమాధానం ఇచ్చాడు. దీనికి ఎలాబొరేషన్ ఏంటి అనేది త్వరలో టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్లో చూపించనున్నారు అని స్పష్టమవుతుంది. ‘విష్ణు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు కెరీర్లో.. ‘ఢీ’ ‘దేనికైనా రెడీ’ ‘దూసుకెళ్తా’ ‘ఈడోరకం ఆడోరకం’ వంటి హిట్ సినిమాలు ఉన్నాయి. అలాగే ‘సూర్యం’ ‘అస్త్రం’ ‘పాండవులు పాండవులు తుమ్మెద’ వంటి యావరేజ్ సినిమాలు కూడా ఉన్నాయి.
అయితే యూత్ ఫుల్ సబ్జెక్టులు, ఫ్యామిలీ సబ్జెక్టులు వంటివి చేసి ఉంటే సక్సెస్ అయ్యుండేవాడు అని అప్పట్లో కొంతమంది విశ్లేషకులు కామెంట్లు కూడా చేశారు. ప్రస్తుతం హీరో ఇమేజ్ ను పక్కన పెట్టి మంచి కథా ప్రాధాన్యత కలిగిన సినిమాలను చేస్తాను అని విష్ణు ‘మోసగాళ్ళు’ ప్రమోషన్లలో చెప్పుకొచ్చాడు.