Manchu Vishnu: ఆ హీరో పేరు చెప్పనంటున్న విష్ణు.. కానీ?

మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా మూవీపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 21వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. అదే రోజున ఈ సినిమాకు పోటీగా పలు సినిమాలు రిలీజవుతున్న నేపథ్యంలో జిన్నా సినిమాకు ఆశించిన స్థాయిలో థియేటర్లు దొరకడం లేదని తెలుస్తోంది. విష్ణు గత సినిమా అయిన మోసగాళ్లు సినిమాకు యావరేజ్ రివ్యూలు వచ్చినా ఈ సినిమా కమర్షియల్ గా ఫ్లాపైంది.

50 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించానని విష్ణు చెప్పినా ఈ సినిమాకు 3 కోట్ల రూపాయల కలెక్షన్లు కూడా రాకపోవడంతో విష్ణు మార్కెట్ పై ఆ ప్రభావం పడింది. అయితే తనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో ఆ ట్రోల్స్ గురించి విష్ణు మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తనపై ట్రోల్స్ చేయిస్తున్న హీరో ఎవరో అందరికీ తెలుసని విష్ణు కామెంట్లు చేశారు.

ఆ హీరో పేరును వెల్లడించడం నాకు ఇష్టం లేదని విష్ణు కామెంట్లు చేశారు. అయితే విష్ణు ఈ విధంగా చెప్పడం వల్ల వేర్వేరు పేర్లు ప్రచారంలోకి వచ్చే అవకాశం అయితే ఉంది. మంచు విష్ణు ట్రోల్స్ కు సంబంధించి వివాదం గురించి క్లారిటీ ఇచ్చి ఆ వార్తలకు చెక్ పెడితే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విష్ణు ఈ విధంగా చేస్తారో లేదో చూడాల్సి ఉంది.

మరోవైపు జిన్నా మూవీకి బుకింగ్స్ ఆశించిన రేంజ్ లో లేవు. ప్రసాద్ మల్టీప్లెక్స్ లో మార్నింగ్ షోకు మాత్రమే బుకింగ్స్ బాగున్నాయి. సినిమా రిలీజ్ కు రెండు రోజుల సమయం ఉండటంతో ఆ సమయానికి బుకింగ్స్ పుంజుకుంటాయో లేదో చూడాల్సి ఉంది. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా పాయల్ కు కూడా ఈ సినిమా సక్సెస్ కీలకమే అనే సంగతి తెలిసిందే.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus