Manchu Vishnu: ఆ యూట్యూబ్ ఛానెళ్లను మూయిస్తానన్న మంచు విష్ణు!

ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన మంచు విష్ణు నటించిన జిన్నా మూవీ నేడు థియేటర్లలో విడుదలైంది. ఇషాన్ సూర్య డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని విష్ణు భావిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందే కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు జిన్నా మూవీకి నెగిటివ్ రివ్యూలు ఇవ్వడంపై విష్ణు మండిపడ్డారు. ట్విట్టర్ లో మంచు విష్ణు యూట్యూబ్ ఛానెళ్ల పేర్లతో పాటు నెగిటివ్ రివ్యూలకు సంబంధించిన వీడియోల లింక్స్ ను షేర్ చేశారు.

రిలీజ్ కు ముందే నెగిటివ్ రివ్యూలను ప్రచారంలోకి తెచ్చిన యూట్యూబ్ ఛానెళ్లను త్వరలోనే మూయిస్తానని మంచు విష్ణు తన పోస్ట్ లో పేర్కొన్నారు. తాను ఊహించిందే జరిగిందని ఇదిగో పెయిడ్ బ్యాచ్ ను మీ ముందుకు తీసుకొచ్చానని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. జిన్నా సినిమా ఇంకా రిలీజ్ కాలేదని సినిమా రిలీజ్ కు ముందే నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు.

జిన్నా సినిమా విషయంలో ఎందుకింత ద్వేషం అని విష్ణు కామెంట్లు చేశారు. జిన్నా మూవీ తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఈరోజు రిలీజ్ కానుంది. ఈ సినిమా విషయంలో ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సి ఉంది. జిన్నా సినిమాతో పాటు ఈరోజు థియేటర్లలో క్రేజ్ ఉన్న పలు సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ మధ్య కాలంలో మంచు విష్ణు సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.

జిన్నా మూవీ విషయంలో ఆ తప్పు జరగకుండా మంచు విష్ణు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సినిమా మంచు విష్ణు మర్కెట్ ను కూడా డిసైడ్ చేయనుందని చెప్పవచ్చు. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. మరోవైపు విష్ణు కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. జిన్నా మూవీకి తక్కువ సంఖ్యలో థియేటర్లు దక్కాయని బోగట్టా.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus