Kannappa: మంచు విష్ణు ‘కన్నప్ప’ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది.. కానీ!

  • August 18, 2023 / 09:52 PM IST

‘భక్త కన్నప్ప’ టాలీవుడ్లో రూపొందిన ఆల్ టైం క్లాసిక్ సినిమాల్లో ఇది కూడా ఒకటి.అలాంటి క్లాసిక్ ను మంచు విష్ణు రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కొన్ని మార్పులు చేసి రూపొందించనున్నట్లు కూడా తెలిపాడు. మొదట తనికెళ్ళ భరణి తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలి అనుకున్నాడు. కానీ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఆ ఆలోచన మార్చుకున్నాడు. కోవిడ్ టైంలో కొంతమంది దర్శకులను అనుకున్నాడు.

కానీ వాళ్ళు రూ.95 కోట్ల వరకు బడ్జెట్ అవుతుంది అని చెప్పారట. అందులో 30 శాతం పారితోషికం కావాలని కూడా అడిగారట. వాళ్లకి ఈ ప్రాజెక్ట్ చేయడం ఇష్టం లేదని మంచు విష్ణు భావించాడట. ‘భక్త కన్నప్ప’ రీమేక్ కి మంచు విష్ణు అనుకున్న బడ్జెట్ రూ.60 కోట్లు. అది కూడా తక్కువ బడ్జెట్ కాదు. కానీ టెక్నాలజీని కరెక్ట్ గా వాడుకునే దర్శకుడు దొరికితే ఆ బడ్జెట్ లో సినిమా కంప్లీట్ చేయొచ్చు.

ఈ క్రమంలో ‘భక్త కన్నప్ప’ (Kannappa) రీమేక్ ను బాలీవుడ్ సీరియల్ డైరెక్టర్ కి అప్పగించాడు మంచు విష్ణు. ముఖేష్ కుమార్ గౌడ్ అనే సీరియల్ దర్శకుడికి ‘కన్నప్ప’ రీమేక్ పనులు అప్పగించాడు మంచు విష్ణు. ముఖేష్ కుమార్ గౌడ్.. ‘మీరా’ ‘హోమ్ స్వీట్ హోమ్’ వంటి టీవీ సిరీస్ లు రూపొందించాడు. ఈరోజు ఆ ప్రాజెక్ట్ గ్రాండ్ గా ప్రారంభమైంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus