ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించి అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన ‘మా’లో మహిళల భద్రత, సాధికారతను పెంపొందించే దిశగా అడుగులు వేస్తూ.. ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రముఖ సామాజిక కార్యకర్త సునీత కృష్ణన్ ఈ కమిటీకి గౌరవ సలహాదారుగా ఉంటారని వెల్లడించారు. తాజాగా తన ఎజెండాల్లో ఒకటైన సభ్యుల ఆరోగ్యాలపై దృష్టి పెట్టినట్లు విష్ణు పేర్కొన్నారు.
మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన విష్ణు.. ‘మా’ సభ్యుల ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు నగరంలోని ఏఐజీ, అపోలో, కిమ్స్, మెడికవర్, సన్ షైన్ హాస్పిటల్స్ తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. ఈ హాస్పిటల్స్ లో యాభై శాతం రాయితీపై ఓపీ కన్సల్టేషన్ తో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఉచిత ఆంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించనున్నట్లు చెప్పారు. అలానే నిరంతరం సభ్యులు తమ ఆరోగ్యాన్ని ఈ హాస్పిటల్స్ లో ఉచితంగా పరీక్షించుకోవచ్చని వెల్లడించారు.
అంతేకాకుండా.. వైద్యనిపుణులతో ముఖాముఖీ మాట్లాడడంతో పాటు వీడియో కన్సల్టెంట్ ద్వారా కూడా సంప్రదించవచ్చని సూచించారు. అసోసియేషన్స్ లో ఉన్న సభ్యులందరికీ దశల వారీగా ఆరోగ్య పరీక్షలు చేయిస్తామని పేర్కొన్నారు. డిసెంబర్‌లో మెడికవర్, మార్చిలో ఏఐజీ, జూన్‌లో అపోలో, సెప్టెంబర్‌లో కిమ్స్ ఆస్పత్రిలో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు మంచు విష్ణు తెలిపారు.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!