Mangalavaaram: ‘మంగళవారం’ను దెబ్బ కొట్టిన ‘ఆదివారం’… ఇప్పుడు కోలుకోకపోతే కష్టమే!

కొన్ని సినిమాలకు మాంచి హిట్‌ టాక్‌ వస్తుంది. జనాలు, నెటిజన్లు, పరిశీలకులు, విశ్లేషకులు… ఇలా అన్ని రంగాల వాళ్లు మంచి మార్కులే వేస్తారు. అయితే ఏమవుతుందో ఏమో… వీకెండ్‌ తర్వాత సరైన వసూళ్లు ఉండవు. దీంతో అప్పటివరకు చెప్పిందంతా, చేసిందంతా, చూసిందంతా వేస్ట్‌ అయిపోతుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లోనే ‘మంగళవారం’ సినిమా ఉందంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. శుక్రవారం సినిమాకు వచ్చిన బజ్‌… ఆదివారం ప్రపంచకప్‌ ఫైనల్ తినేసిందట. అయితే, ఆ తర్వాత సోమవారం సినిమాకు సరైన వసూళ్లు లేవు అంటున్నారు.

ఇలాంటి చిన్న సినిమాలకు బజ్‌ వచ్చినప్పుడు ఇంకాస్త పెప్‌ పడాలి అని చెబుతుంటారు. లేదంటే సినిమాకు మౌత్‌ టాక్‌ ఆగిపోతుంది. ఫామ్‌ కోల్పోయిన బ్యాటర్‌లా వసూళ్లు పడిపోతాయి. అలా ‘మంగళవారం’ సినిమాకు శనివారం వసూళ్లు బాగానే ఉన్నా… ఆదివారం తొలి ఆట ఫర్వాలేదు అనిపించిందట. రెండో ఆట నుండి ప్రపంచ కప్‌ ఫైనల్‌ ఫీవర్‌ మడతెట్టేసిందట. దీనికి తోడు మండే నుండి జనాలు ఎవరి పనుల్లో బిజీ అయిపోవడంతో సినిమాకు ఆశించిన ఫుట్‌ ఫాల్స్‌ లేవు అని చెబుతున్నారు.

ఇక మంగళవారం కూడా ఉదయం ఆటలకు టికెట్లు ఆశించి స్థాయిలో తెగలేదు అని చెబుతున్నారు. దీంతో ‘మంగళవారం’ టీమ్‌ అర్జెంట్‌ తన ప్లాన్స్‌ మార్చుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలని, మంచి సినిమా, బజ్‌ వచ్చింది, మంచి రివ్యూలు వచ్చాయి అని ఊరుకోవద్దు అని సూచిస్తున్నారు. అనుకున్నట్లుగానే (Mangalavaaram) ‘మంగళవారం’ టీమ్‌ మంగళవారం నుండి కాస్త ప్రచారం ప్రారంభించింది.

అయితే దాని జోరు ఇంకాస్త పెంచాల్సి ఉంది. పోయిన సినిమానే పట్టుకుని ప్రచార చేసీ చేసీ వదిలిపెడుతున్న జనాలున్న రోజులివి. మంచి టాక్‌ వచ్చిన సినిమాను ఎందుకు వదిలేయడం చెప్పండి. మరి ఈ దిశగా దర్శక నిర్మాతలు ఎలాంటి ప్లాన్‌ చేస్తారో చూడాలి. ఈ వారం సరైన సినిమాలు వస్తున్నా ఇంకో రెండు రోజులు గట్టిగా వసూళ్లు లాగే అవకాశం ఉంది.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus