Vijay,Mahesh: విజయ్- మహేష్ తో అనుకుంటే.. ‘పొన్నియన్ సెల్వన్’ గురించి ఆసక్తికర విషయాలు..!

కోలీవుడ్ స్టార్ దర్శకుడు మణిరత్నం.. ఎన్నో గుర్తిండి పోయే చిత్రాలు మనకు అందించారు. అయితే ఇటీవల కాలంలో ఆయన జోరు బాగా తగ్గింది. ‘ఓకే బంగారం’ ‘నవాబ్’ వంటి చిత్రాలు మణిరత్నం కెపాసిటీ ఇంకా తగ్గిపోలేదు అని నిరూపించాయి. అందుకే ఆయన నుండి రాబోతున్న ‘పొన్నియన్ సెల్వన్-1’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టే ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘పొన్నియన్ సెల్వన్’ అనేది మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ అని ఎక్కువమందికి తెలిసుండదు.

4 దశాబ్దాలుగా మణిరత్నం ఈ ప్రాజెక్టుని తెరకెక్కించాలి అనుకుంటున్నారు.ఒకప్పటి కోలీవుడ్ స్టార్ హీరో ఎమ్‌జీఆర్ తో ‘పొన్నియిన్ సెల్వన్’ తెరకెక్కించాలి అని మణిరత్నం అనుకున్నారు. కానీ ఆ టైంలో అది వర్కౌట్ కాలేదు. అటు తర్వాత ఏళ్లకు ఏళ్ళు ఆ ప్రాజెక్టుని తెరకెక్కించాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఒకానొక టైంలో మహేష్ బాబు – విజయ్ లతో ఈ ప్రాజెక్టుని తెరకెక్కించాలి అనుకున్నారు. కానీ బడ్జెట్ వంటి లెక్కలు ఆయన్ని భయపెట్టాయి, వెనక్కినెట్టాయి.

తర్వాత నాగార్జున, విక్రమ్, మహేష్ బాబు.. ఇలా ఎంతో మంది తో వర్కౌట్ చేయాలి అని అనుకున్నారు. దర్శకుడు రెడీ, హీరోలు రెడీ.. ఇక్కడ సమస్యల్లా నిర్మాత ధైర్యం చేయలేకపోవడంతో ఈ ప్రాజెక్టు ఇన్నేళ్లు డిలే అవుతూ వచ్చింది. అయితే ‘బాహుబలి’ ఇలాంటి డ్రీం ప్రాజెక్టులు అన్నిటికీ ప్రాణం పోసింది. కథ ఎలా ఉన్నా.. అనుకున్న కథని అందరికీ నచ్చే విధంగా తీర్చిదిద్దగలిగితే అందరూ మెచ్చుకుని బ్లాక్ బస్టర్ చేస్తారు అని ఆ మూవీ నిరూపించింది.

‘బాహుబలి’ రెండు పార్టులుగా రూపొంది.. సంచలనం సృష్టించింది. ‘పొన్నియన్ సెల్వన్’ కు కూడా మణిరత్నం అదే ఫార్ములా అప్లై చేశాడు.తనే ఓ నిర్మాతగా మారి ‘లైకా’ వారితో కలిసి ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా రూపొందిస్తున్నాడు మణిరత్నం. ఇన్నేళ్ళుగా ఆయన సంపాదించినదంతా ఈ సినిమా పైనే పెట్టేశాడు అంటే ఆయన డ్రీం ప్రాజెక్టు పై ఎంత నమ్మకం ఉంది అనేది స్పష్టమవుతుంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus