మణిరత్నం సినిమాకి రెండు భాషల్లో భిన్నమైన రిజల్ట్స్

ప్రేక్షకులకు ఎప్పుడు ఎలాంటి సినిమాలు నచ్చుతాయి అనేది ఇప్పటివరకూ ఏ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, విమర్శకుడు కూడా గెస్ చేయలేకపోయాడు. ఇకపై గెస్ చేస్తాడో లేదో కూడా తెలీదు. అందుకే.. ఒక్కోసారి తమిళంలో హిట్ అయిన సినిమాలు తెలుగులో ఫ్లాప్ అవుతుంటాయి, తమిళంలో ఫ్లాప్ అయిన సినిమాలు తెలుగులో సూపర్ హిట్ అవుతుంటాయి. తాజాగా ఆ కోవలో నిలిచిన చిత్రం “నవాబ్”. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. రెండు చోట్ల విమర్శకులు, విశ్లేషకులు విశేషంగా పొగిడిన ఈ సినిమా తమిళంలో మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుండగా.. తెలుగులో మాత్రం మినిమం కలెక్షన్స్ కూడా లేవు.

దాంతో తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం తెలుగులో మాత్రం యావరేజ్ గా మిగిలిపోయింది. లాంగ్ వీకెండ్ తోపాటు రేపు హాలీడే ఉన్నప్పటికీ సినిమాకి ఆశించిన స్థాయి బుకింగ్స్ లేవు. మరి ఈ సినిమా తెలుగులో సమర్పించిన నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలు తెచ్చిపెడుతుందా లేక ఫ్లాప్ అవుతుందా అనేది వేచి చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus