మహేష్ తో అలా చేయించేటప్పుడు మేము చాలా భయపడ్డాం – మానిక్ రెడ్డి

  • November 1, 2018 / 07:43 AM IST

స్నేహానికి విలువిచ్చే సెలబ్రిటీల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. స్టార్ డైరక్టర్ అయినప్పటికీ తన మిత్రులకోసం సమయాన్ని కేటాయిస్తుంటారు. అలాగే వారి అభివృద్ధికి తోడ్పాటును అందిస్తుంటారు. త్రివిక్రమ్ ఆప్త మిత్రుల జాబితాలో మానిక్ రెడ్డి ఉన్నారు. అతనికి త్రివిక్రమ్ తన సినిమాల్లో ఏదొక పాత్ర ఇస్తుంటారు. తాజాగా “అరవింద సమేత”లోను ఛాన్స్ ఇచ్చారు. ఈ చిత్రంలో “ఆకు తిను..” అనే డైలాగ్ తో మానిక్ రెడ్డి పాపులర్ అయ్యారు. దీంతో మానిక్ రెడ్డి కి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ త్రివిక్రమ్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. “త్రివిక్రమ్ రచయితగా అవకాశాల కోసం కష్టపడుతున్నప్పటి నుంచి నాకు తెలుసు. అవకాశాల కోసం కష్టపడ్డప్పుడు ఎలా ఉండేవాడో, ఇప్పుడు కూడా ఆయన అలాగే ఉన్నాడు. సినిమాలతో సమాజానికి ఏదైనా మంచి సందేశం ఇవ్వాలనేది త్రివిక్రమ్ తాపత్రయం. తన సినిమాల్లో కొత్తదనం, సహజత్వం రెండు ఉండేందుకు ప్రయత్నిస్తాడు.

అందుకోసం ‘అతడు’ సినిమా సమయంలో మహేష్ బాబును చాలా రిస్కీ ప్రదేశంకు తీసుకు వెళ్లాడు. అక్కడ మామూలుగా సెలబ్రెటీలు తిగడమే కష్టం. అలాంటిది అక్కడ చిత్రీకరణ చేశాడు. ‘అతడు’ సినిమాను పాతబస్తీలోని మీర్ చౌక్ – మీరాలం మండీ వంటి ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపారు. కథానుసారంగా ఆ ప్రాంతాల్లో అయితేనే సీన్స్ సహజంగా వస్తాయనే ఉద్దేశ్యంతో త్రివిక్రమ్ అక్కడ ప్లాన్ చేశాడు. ఆ ప్రదేశంలో షూటింగ్ అంటే చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా భయపడ్డారు. మహేష్ ను రిస్క్ లో పెడుతున్నారని త్రివిక్రమ్ ను వారించారు. అయినా కూడా త్రివిక్రమ్ తాను అనుకున్నట్లుగా పాతబస్తీలో చిత్రీకరణ జరిపాడు. ఆ చిత్రీకరణ అంతా పూర్తి అయిన తర్వాత హమ్మయ్య అంటూ అంతా ఊపిరి పీల్చుకున్నాం” అని మానిక్ రెడ్డి వెల్లడించారు. త్రివిక్రమ్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని మానిక్ రెడ్డి .. త్రివిక్రమ్ పై అభినందనలు గుప్పించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus