జూలై 21న రాబోతోన్న ‘అలా ఇలా ఎలా’ పెద్ద విజయాన్ని సాధించాలి.. మెలోడి బ్రహ్మ మణిశర్మ

ప్రముఖ దర్శకుడు పి.వాసు తనయుడు శక్తి వాసుదేవన్ హీరోగా రాజ్ శంకర్, పూర్ణ, నాగబాబు, బ్రహ్మానందం, అలీ, సీత, సితార, నిషా కొఠారి ప్రధాన పాత్రల్లో రాబోతున్న చిత్రం ‘అలా ఇలా ఎలా’. రాఘవ దర్శకత్వం వహించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని కళ మూవీ మేకర్స్ పతాకంపై కొల్లకుంట నాగరాజు నిర్మించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పాటలకు, చిత్ర టీజర్, ట్రైలర్స్‌లకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఎస్.కె.ఎం.ఎల్. మోషన్ పిక్చర్స్ సంస్థ ద్వారా జూలై 21 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మెలోడి బ్రహ్మ మణిశర్మ తన బెస్ట్ విషెస్ అందించారు.

మణిశర్మ మాట్లాడుతూ.. ‘నిర్మాత అనే వాడు ఓ చెట్టులాంటి వాడు. అలాంటి నిర్మాతను మనం కాపాడుకోవాలి.. వందల మందికి పనిని కల్పిస్తుంటారు. రాఘవ గారు మంచి దర్శకుడు. ఇందులో నాలుగు పాటలుంటాయి. అలాంటి పాటలను నేను కూడా ఇంత వరకు ప్రయోగించలేదు. సిరివెన్నెల గారు మూడు పాటలు, భాస్కర భట్ల గారు ఒక పాటను రాశాను. సినిమాను అందంగా తీశారు. మా దర్శక నిర్మాతలకు మంచి సక్సెస్ రావాలి. అలా ఇలా ఎలా జూలై 21 న విడుదల కాబోతోంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus