డేటింగ్ న్యూస్ చూసి చాలా బాధపడ్డాను
- June 30, 2018 / 05:15 PM ISTByFilmy Focus
సాహసం శ్వాసగా సాగిపో చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మలయాళీ ముద్డుగుమ్మ మంజిమ మోహన్ తాజాగా తమిళ, మలయాళీ భాషల్లో నటిస్తోంది. ఆమె ప్రస్తుతం గౌతమ్ కార్తీక్ చిత్రంలో నటిస్తోంది. తన కెరీర్ గురించి మీడియాతో మాట్లాడుతూ, సినిమాల్లో గ్లామర్ అవసరమేనని, అయితే తాను అంగాంగ ప్రదర్శనకు దూరమని తేల్చి చెప్పింది. చీర కట్టుకుని కూడా అందంగా కనిపించవచ్చని, కానీ తాను ఒళ్ళు మాత్రం చూపించలేనని తెలిపింది.
చీరలోసైతం శృంగార సన్నివేశాల్లో నటించవచ్చని, . కథకు అవసరం అనిపిస్తే ఆ విధంగా నటిస్తానని చెప్పింది. ఇక తనకు నటుడు రిషికి మధ్య ప్రేమ వ్యవహారంపై స్పందిస్తూ, రిషి నిజంగానే తనకు మంచి స్నేహితుడని, అంత మాత్రాన డేటింగ్ చేస్తున్నాని వార్తలు రావడం తనను బాధించిందని పేర్కొందింది. తాను డేటింగ్ చేస్తునట్లు కనీసం ఫోటో ఆధారం కూడా లేకుండా ఇలాంటి వార్తలు రాయడం తగదు అని మీడియాకు హితకు పలికింది.













