మంచి కలెక్షన్లను రాబట్టిన ‘మన్మధుడు2’..!

అక్కినేని అందగాడు కింగ్ నాగార్జున హీరోగా నటించిన తాజా చిత్రం ‘మన్మధుడు2’. ‘ఆనంది ఆర్ట్ క్రియేషన్స్’ ‘అన్నపూర్ణ స్టూడియోస్’ ‘వియాకామ్ మోషన్ పిక్చర్స్’ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సమంత, కీర్తి సురేష్ కూడా కీలక పాత్రలు పోషించారు. ఆగష్టు 9 న(నిన్న) విడుదలయిన ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. ‘మన్మధుడు’ క్రేజ్ కూడా ఈ చిత్రానికి బాగా హెల్ప్ అవ్వడంతో ‘మన్మధుడు2’ చిత్రం మొదటిరోజు మంచి కలెక్షన్లను రాబట్టింది.

‘మన్మధుడు2’ మొదటి రోజు ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 1.30 కోట్లు
సీడెడ్ – 0.48 కోట్లు


వైజాగ్ – 0.46 కోట్లు
ఈస్ట్ – 0.35 కోట్లు
వెస్ట్ – 0.28 కోట్లు


కృష్ణా – 0.28 కోట్లు
గుంటూరు – 0.54 కోట్లు
నెల్లూరు – 0.18 కోట్లు
———————————————————


నైజాం + ఏపీ (టోటల్) – 3.86 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా – 0.87 కోట్లు
ఓవర్సీస్ – 0.30 కోట్లు
————————————————————-
వరల్డ్ వైడ్ (టోటల్) – 5.03 కోట్లు( షేర్)
————————————————————–

‘మన్మధుడు2’ చిత్రానికి 20 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొదటి రోజు ఈ చిత్రానికి 5 కోట్ల షేర్ వచ్చింది. శని, ఆదివారాలతో పాటు సోమవారం ‘బక్రీద్’ సెలవు ఉంది కాబట్టి ఈ చిత్రానికి కలిసొచ్చే అంశం. నాగార్జున కెరీర్లో ‘ఆల్ టైం హిట్’ గా నిలిచిన ‘మన్మధుడు’ చిత్రానికి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రం క్రేజ్.. ఈ చిత్రానికి బాగా కలిసొచ్చిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దీంతో మిగిలిన 15 కోట్లను కూడా ‘మన్మధుడు2’ ఈజీ గా రాణిస్తుందని వారు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus