భారీ రేటుకు ‘మన్మధుడు2’ డిజిటల్ రైట్స్..!

  • July 22, 2019 / 05:59 PM IST

ప్రస్తుతం నాగార్జున హవా ఎక్కువ నడుస్తుంది. ఓ పక్క ‘బిగ్ బాస్3’ హోస్ట్ గా నాగ్ ఎంట్రీ అదిరిపోయింది. బుల్లితెర పై నాగ్ సందడి ఓ రేంజ్లో ఉండబోతుందని నిన్న మొదలైన షో తో అర్థమైపోయింది. ఇక వెండితెర పై కూడా అలరించడానికి నాగ్ రెడీ అవుతున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మన్మధుడు2’ ఆగష్టు 9 న విడుదల కాబోతుంది. ‘చి ల సౌ’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌ గా నటిస్తుంది. రొమాంటిక్ ఎంట‌ర్‌ టైన‌ర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈమధ్యే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

ఇక ఈ చిత్రం డిజిటిల్ రైట్స్ ను ‘నెట్ ఫ్లిక్స్’ సంస్థ భారీగా 7.4 కోట్లకు కొనుగోలు చేసిందట. నిజంగా ఇది ఒక రికార్డు అనే చెప్పాలి. ఇప్పటికే విడుదల చేసిన టీజర్స్ ప్రామిసింగ్ గా ఉండడం… అలాగే నాగ్ కెరీర్లో ఆల్ టైం హిట్టు గా నిలిచిన ‘మన్మధుడు’ చిత్రానికి సీక్వెల్ కావడంతో ఈ చిత్రానికి క్రేజ్ ఏర్పడింది. అందుకే ఇంత భారీ రేటు పెట్టి ‘నెట్ ఫ్లిక్స్’ సంస్థ కొనుగోలు చేసినట్టు స్పష్టమవుతుంది. ఇక `మ‌న్మ‌థుడు 2` థియేట్రికల్ ట్రైలర్ ను జూలై 25న విడుదల చేయబోతున్నట్టు సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus