ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ను మారుతి ఎలా డీల్ చేస్తాడో అనే అనుమానం మొన్నటి వరకు చాలామందిలో ఉండేది. కానీ రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ చూసాక ఫ్యాన్స్ లో కాన్ఫిడెన్స్ పీక్స్ కు వెళ్ళింది. సాధారణంగా ప్రభాస్ అంటేనే భారీ యాక్షన్ కటౌట్ అనే ముద్ర పడిపోయింది. కానీ ‘ది రాజా సాబ్’ తో ఆ ఇమేజ్ ను పూర్తిగా మార్చేసి, ఒక కొత్త కోణాన్ని చూపించబోతున్నానని మారుతి గట్టిగా చెబుతున్నారు. ఇది కేవలం రొటీన్ సినిమా కాదని, హారర్ ఫాంటసీ జానర్ లో ప్రేక్షకులు ఇప్పటిదాకా చూడని సరికొత్త ప్రపంచమని ఆయన క్లారిటీ ఇచ్చారు.
ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ గురించి మారుతి చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. డార్లింగ్, మిర్చి సినిమాల్లో మనం చూసిన ఆ వింటేజ్, జోవియల్ ప్రభాస్ మళ్ళీ ఇందులో కనిపిస్తారట. సీరియస్ యాక్షన్ మూడ్ లో ఉన్న ఫ్యాన్స్ కు ప్రభాస్ కామెడీ టైమింగ్, ఎనర్జీ ఒక పెద్ద సర్ ప్రైజ్ అవుతుందని అంటున్నారు. నిజానికి దీన్ని ఒక సింపుల్ కామెడీ సినిమాగా అనుకున్నారట. కానీ ప్రభాస్ ఎంట్రీతో స్కేల్ మారిపోయి, హారర్ ఫాంటసీగా టర్న్ అయ్యిందని, ఇందులో దెయ్యాలు కూడా పొగ రూపంలో వెరైటీగా ఉంటాయని లీక్ చేశారు.
సినిమాలో అసలైన హైలైట్ ‘హిప్నాసిస్’ కాన్సెప్ట్. కథలో ఎక్కువ భాగం ఈ హిప్నాసిస్ జోన్ లోనే నడుస్తుందట. మారుతికి యానిమేషన్ బ్యాక్ గ్రౌండ్ ఉండటంతో వీఎఫ్ఎక్స్ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. క్లైమాక్స్ లో వచ్చే ఒక భారీ మాన్స్టర్ ఎపిసోడ్, విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని సమాచారం. షూటింగ్ డిలే అవ్వకుండా ముందుగానే స్టోరీ బోర్డులు, మాక్ షూట్స్ ప్లాన్ చేసుకుని మరీ వలస వెళ్ళారట.
ఇక ఈ సినిమా కోసం మారుతి ఏకంగా ఏడాది పాటు స్క్రిప్ట్ మీద కూర్చున్నారు. ఫస్ట్ కట్ మూడున్నర గంటలు వచ్చినా, దాన్ని క్రిస్ప్ గా మూడు గంటల లోపు కుదించారు. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ ఏకంగా 40 నిమిషాల పాటు ఉంటుందట. దీన్ని షూట్ చేయడానికే 70 రోజులు పట్టిందంటే మేకర్స్ దీనిపై ఎంత శ్రద్ధ పెట్టారో అర్థం చేసుకోవచ్చు. ప్రభాస్ కు కూడా ఈ క్లైమాక్స్ బాగా నచ్చిందని, ఇదే సినిమాకు మేజర్ అసెట్ అని మారుతి నమ్మకంగా చెబుతున్నారు.
