‘మహానుభావుడు’ కాంబినేషన్ వర్కౌట్ అయ్యిందా..?

గత సంవత్సరం మారుతీ డైరెక్షన్లో నాగచైతన్య, అనూ ఇమాన్యుయల్ హీరో,హీరోయిన్లుగా తెరకెక్కించిన చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. ఈ చిత్రం మారుతి ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు. మారుతీ ఆ షాక్ నుండీ తేరుకోవడానికి చాలా సమయం పట్టిందనే చెప్పాలి.

ఇక అటు తరువాత మారుతీ… అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయాలనుకున్నా అది వర్కౌట్ కాలేదు. అందులోనూ ‘గీతా ఆర్ట్స్’ తో మారుతికి మంచి స్నేహబంధం ఉందన్న సంగతి తెలిసిందే. దాని కారణంగా బన్నీతో సినిమా చేయాలని గట్టి ప్రయత్నాలే చేసినప్పటికీ.. అది వర్కౌట్ అవ్వలేదు. త్రివిక్రమ్ తో కమిట్మెంట్ ఉండడం వలెనే మారుతి ప్రయత్నం ఫలించలేదని తెలుస్తుంది. పోనీ.. విజయ్ దేవరకొండతో చేయాలని ప్రయత్నాలు చేసినా…ఇప్పటికే విజయ్ దేవరకొండ కాల్ షీట్లు బిజీగా ఉండటంతో… మారుతీకి అక్కడ కూడా నిరాశే ఎదురయ్యిందట.

ఇక ఈ తరుణంలో…. శర్వానంద్ తో మరోసారి పని చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘మహానుభావుడు’ అనే సూపర్ హిట్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా శర్వానంద్ కూడా ‘పడి పడి లేచె మనసు’ లాంటి డిజాస్టర్ తో డీలా పడిపోయాడు. ఇప్పుడు శర్వానంద్ కి కూడా ఓ హిట్టు కావలి. ఈ క్రమంలో మారుతీ మీద ఉన్న నమ్మకంతో…. శర్వా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus