ప్రభాస్ మిడ్ రేంజ్ హీరోనా? అతన్ని రాజమౌళి పాన్ ఇండియా స్టార్ ను చేశాడా? ఇలా పలికింది మరెవరో కాదు ‘ది రాజాసాబ్’ దర్శకుడు మారుతీ(Maruthi). నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మారుతీ పలికిన మాటలు ఇవి. విషయంలోకి వెళితే.. ‘రాజమౌళి గారికి మేమంతా రుణపడిపోయాం. ఎందుకంటే ఈరోజు పాన్ ఇండియా పాన్ ఇండియా అంటూ తిరుగుతున్నాం.. కానీ ఒక వ్యక్తి లైఫ్ పెట్టేసి.. మీడియం రేంజ్ హీరోని పాన్ ఇండియాకి పరిచయం చేసి ప్రపంచానికి ఈరోజు పెద్ద కటౌట్ ని నిలబెట్టారు ఆయన’ అంటూ మారుతీ చెప్పుకొచ్చారు.
ఆ వెంటనే మారుతీకి కూడా టంగ్ స్లిప్ అయినట్టు అనిపించి ఉంది.. వెంటనే ఏడ్చేసి సింపతీ యాంగిల్ కి షిఫ్ట్ అయిపోయాడు. దీంతో వెంటనే అతని కామెంట్స్ ని డైవర్ట్ చేసినట్టు అయ్యింది.మారుతీ గ్రహించాల్సింది చాలా ఉంది. ‘బాహుబలి’ తో ప్రభాస్ మార్కెట్ 10 రెట్లు పెరిగింది అనేది వాస్తవం. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ‘బాహుబలి’ కి ముందు కూడా ప్రభాస్ స్టార్ హీరోనే. అతని ఖాతాలో ‘మిస్టర్ పర్ఫెక్ట్’ ‘డార్లింగ్’ ‘మిర్చి’ వంటి బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి.
అలాగే మిగిలిన సినిమాలు ప్లాప్ అయినా.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టిన సందర్భాలు ఉన్నాయి. ‘మిర్చి’ సినిమా అన్ సీజన్లో వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద రూ.48 కోట్లు షేర్ ను కొల్లగొట్టింది. అల్లు అర్జున్ కి కూడా ఆ రేంజ్ వసూళ్లు సాధించిన సినిమా అప్పటికి లేదు. మరోవైపు రాజమౌళి వల్లే ప్రభాస్ పెద్ద స్టార్ అయితే.. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఎన్టీఆర్, చరణ్..లకి ఆ రేంజ్ క్రేజ్ వచ్చిందా? ముమ్మాటికీ లేదు. పోనీ ‘ఆర్.ఆర్.ఆర్’.. ‘బాహుబలి’ రేంజ్లో హిట్ అయ్యిందా? అది కూడా మారుతీ గమనించాలి కదా.
గతంలో ‘చక్కిలిగింత’ సినిమా ప్రమోషన్స్ లో కూడా మారుతీ ఇలాగే ప్రభాస్ క్రేజ్ విషయంలో నోరు జారాడు. ఆ టైంలో ఆ విషయం పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అయ్యింది. ఇక ‘ది రాజాసాబ్’ కి ముందు మారుతీ ‘పక్కా కమర్షియల్’ అనే డిజాస్టర్ ఇచ్చాడు. దానికి ముందు చేసిన సినిమా కూడా డిజాస్టరే. అయినా సరే ప్రభాస్.. ‘ది రాజాసాబ్’ చేసుకునే ఛాన్స్ ఇచ్చాడు. అయినా మారుతీ ‘ప్రభాస్..ని మిడ్ రేంజ్ హీరో’ అంటూ ప్రస్తావించడం ఏమాత్రం సరికాదు అనే చెప్పాలి.
అంతెందుకు ఈ మధ్య కాలంలో సినిమా ప్రమోషన్స్ లో దర్శకులు పిచ్చి పిచ్చి ఛాలెంజ్ లు చేస్తున్నారు.. అంటూ ‘బ్యూటీ’ సినిమా టైంలో మారుతీ చెప్పడం జరిగింది. అయినా సరే నిన్న ‘ది రాజాసాబ్’ ఈవెంట్లో ‘ ‘ది రాజాసాబ్’ కనుక ఆడియన్స్ కి నచ్చకపోతే నా ఇంటి అడ్రెస్ చెబుతున్నా’ అంటూ ఛాలెంజ్ విసిరాడు. ఇవన్నీ చూస్తుంటే మారుతీకి ఏ విషయంలోనూ పెద్దగా అవగాహన లేనట్టే కనిపిస్తుంది.