‘బిగ్ బాస్ సీజన్ 9’ ప్రారంభమయ్యి ఇప్పటికే 5 వారాలు కావస్తోంది.ఇప్పటికే హౌస్ నుండి శ్రేష్టి వర్మ మొదటి వారం ఎలిమినేట్ అవ్వడం జరిగింది. అటు తర్వాత రెండో వారం మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక 3వ వారం ప్రియా శెట్టి ఎలిమినేట్ ఎలిమినేట్ అయ్యింది. ఇప్పుడు 4వ వారం ఎలిమినేషన్ పై అందరి దృష్టి పడింది. ఈ వారం నామినేషన్స్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన దివ్య నిఖితా,మాస్క్ మ్యాన్ హరీష్, దమ్ము శ్రీజ,ఫ్లోరా సైని, రీతూ చౌదరి, సంజన గల్రాని వంటి వారు ఉన్నారు.
వీరిలో ఎవరు ఎలిమినేట్ అయ్యి ఈ వారం హౌస్ లో నుండి బయటకు వస్తారు అనేది అందరిలోనూ ఆసక్తి పెంచింది. ఓటింగ్ పరంగా చూసుకుంటే దమ్ము శ్రీజ, మాస్క్ మెన్ హరీష్ తప్ప అందరూ సేఫ్ సైడ్ ఉన్నారు. వీరిలో ఫైనల్ గా దమ్ము శ్రీజకి కొంచెం ఎక్కువ ఓట్లు పడటంతో ఆమె సేఫ్ అయ్యిందట. ఇక ఆమె కంటే తక్కువ ఓట్లు పడిన కారణంగా హరీష్ ఎలిమినేట్ అయినట్టు సమాచారం.
హరీష్ ఎలిమినేషన్ ఒక రకంగా అందరికీ షాక్ ఇచ్చేదే. ఎందుకంటే మొదటి వారం ఇతని తీరు చూసి కచ్చితంగా టాప్ 5 లో ఉంటాడు అని అంతా భావించారు. అయితే తర్వాతి వారం నుండి అతను సైలెంట్ అయిపోయాడు. అతను యాక్టివ్ గా కదిలి గేమ్ ఆడటం, డిస్కషన్స్ లో పాల్గొనొకపోవడంతో జనాలు హరీష్ ని టార్గెట్ చేసినట్టు స్పష్టమవుతుంది.