కాజల్ అగర్వాల్..ఇదివరకటితో పోలిస్తే కెరీర్లో ఇప్పుడు కొంచెం వెనుకబడింది అనే చెప్పాలి. వాస్తవానికి ఫ్యామిలీ లైఫ్ ను దృష్టిలో పెట్టుకుని ఆమెనే సినిమాలు తగ్గించినట్టు స్పష్టమవుతుంది. గత ఏడాది వచ్చిన ‘సత్యభామ’ సినిమా తర్వాత కాజల్ హీరోయిన్ గా మరో సినిమా చేయలేదు. ‘ఇండియన్ 2’ లో అతిథి పాత్రలో మెరిసింది. అలాగే ‘కన్నప్ప’ సినిమాలో కూడా పార్వతీ దేవిగా కాసేపు కనిపించింది. ప్రస్తుతం హిందీలో ‘ది ఇండియన్ స్టోరీ’, ‘రామాయణ్ పార్ట్ 1’ ‘రామాయణ్ పార్ట్ 2’ వంటి బడా ప్రాజెక్టుల్లో నటిస్తుంది.
‘రామాయణ్’ లో కాజల్ మండోదరి పాత్రలో కనిపించనుంది. రావణాసురుడి భార్య పాత్ర అది. ఈ సినిమాలో రావణాసుడిగా కె.జి.ఎఫ్ స్టార్ యష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ‘ఇండియన్ 3’ లో కూడా కాజల్ నటించింది. ఆ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో? ఎప్పుడు విడుదలవుతుందో? దర్శకుడు శంకర్ కు, కమల్ హాసన్ కు మాత్రమే తెలియాలి. అయితే ఆ సినిమాకు సంబంధించి కాజల్ పార్ట్ షూటింగ్ మాత్రం కంప్లీట్ అయిపోయిందట.
అసలు విషయం ఏంటన్నది తెలీదు కానీ.. ఈ ఫోటోలు అయితే ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :