మాస్ & క్లాస్ ఆడియన్స్ ను ఆకట్టుకొనే కంటెంట్ ఉన్న సినిమా ఇది

మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ హీరో కూడా ఫ్లాప్స్ కి భయపడి.. తన తదుపరి సినిమాల విషయంలో స్పెషల్ కేర్ తీసుకోంటూ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకొంటున్నాడు. అలాంటిది కేర్ ఫ్రీ యాటిట్యూడ్ కి కేరాఫ్ అడ్రెస్ అయిన రవితేజ మాత్రం ఇప్పటికీ కూడా “ఫ్లాప్ సినిమాలు నా కెరీర్ ని ఏమాత్రం ఎఫెక్ట్ చేయలేవు” అంటూ భీభత్సమైన ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఆయన కథానాయకుడిగా నటించిన “నేల టికెట్టు” ఎల్లుండి (మే 25) ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా విడుదల సందర్భంగా మీడియాతో ముచ్చటించిన రవితేజ.. “నేను ఇప్పటివరకూ రిస్క్ చేయడానికి ఎప్పుడు వెంకాడలేదు, ఇకపై వెనకాడను కూడా.

ఇక నా సినిమా జయాజయాలను బేరీజు వేసుకొంటే.. నేను ఎక్కువ శాతం ఎంటర్ టైన్ మెంట్ కి ప్రాధాన్యత ఇచ్చాను. ఒక్కోసారి అది బెడిసికొట్టిన మాట వాస్తవమే కానీ.. నా క్యారెక్టరైజేషన్ మాత్రం ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. అయినా.. నా మునుపటి సినిమా ఫ్లాప్ అయ్యిందని, నా కొత్త సినిమా మీద ఇప్పటివరకూ ఎప్పుడూ ఎఫెక్ట్ పడలేదు. ఆ నమ్మకంతోనే “టచ్ చేసి చూడు” రిజల్ట్ ఎఫెక్ట్ “నేల టికెట్టు” మీద పడదు అని నమ్మకంగా చెప్పగలను. నా కెరీర్ లో మొట్టమొదటిసారిగా అనాధగా నటిస్తున్నాను. సినిమాలో పాత్ర నా నిజజీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ సినిమా ఒప్పుకోవడానికి ముఖ్యకారణం ఇదే” అని చెప్పుకొచ్చాడు రవితేజ. మరి రవితేజ నమ్మకం “నేల టికెట్టు” ఏమేరకు నిలబెడుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus